Home   »  జాతీయం   »   ఒకే దేశం–ఒకే ఎన్నికను వ్యతిరేకించిన AAP పార్టీ

ఒకే దేశం–ఒకే ఎన్నికను వ్యతిరేకించిన AAP పార్టీ

schedule mahesh

AAP Party | ఆమ్ ఆద్మీ పార్టీ “వన్ నేషన్ – వన్ ఎలక్షన్”పై తన అభిప్రాయాలను ఉన్నత స్థాయి కమిటీకి పంపించింది. ఈ మేరకు ఆప్ పార్టీ జాతీయ కార్యదర్శి ‘వన్‌ నేషన్‌ -వన్‌ ఎలక్షన్‌’ అత్యున్నత స్థాయి కమిటీ కార్యదర్శికి లేఖ రాశారు.

aap-party-that-opposes-one-nation-one-election

AAP Party | ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా ‘వన్‌ నేషన్‌ -వన్‌ ఎలక్షన్‌’ పై అత్యున్నత స్థాయి కమిటీ కార్యదర్శి నితేన్‌ చంద్రకు లేఖ రాశారు. ఒకే దేశం – ఒకే ఎన్నిక ఆలోచనను ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యతిరేకిస్తోందని ఆప్‌ స్పష్టం చేసింది.

ఒకే దేశం–ఒకే ఎన్నికను వ్యతిరేకించిన AAP Party

‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి, దేశ సమాఖ్య రాజకీయాలకు విఘాతం కలిగిస్తుందని పార్టీ కార్యదర్శి పంకజ్ గుప్తా తన లేఖలో తెలిపారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ హంగ్ అసెంబ్లీని ఎదుర్కోలేకపోతోందని, ఫిరాయింపులు, హార్స్ ట్రేడింగ్‌ను క్రియాశీలకంగా ప్రోత్సహిస్తాయన్నారు.

ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల భారత ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో 0.1 శాతం మాత్రమే ఆదా అవుతుందన్నారు. ఇదిలా ఉండగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సైతం పార్లమెంటరీ పాలనా విధానాన్ని అవలంబిస్తున్న దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ఆలోచనకు తావు లేదని, దాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.

జమిలి ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమన్న ఖర్గే

ఏకకాలంలో ఎన్నికలు జరపాలనే ఆలోచన రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమన్నారు. జమిలి ఎన్నికల విధానాన్ని అమలు చేయాలంటే రాజ్యాంగంలో చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగం కల్పించిన ఫెడరలిజానికి విరుద్ధమమని ఖర్గే వ్యాఖ్యానించారు.

Also Read | Ayodhya Security | అయోధ్యలో భారీ భద్రత.!