Home   »  జాతీయం   »   దేశంలో మరో 358 కరోనా కేసులు నమోదు.. 2669కి చేరిన యాక్టివ్‌ కేసులు

దేశంలో మరో 358 కరోనా కేసులు నమోదు.. 2669కి చేరిన యాక్టివ్‌ కేసులు

schedule mahesh

న్యూఢిల్లీ: దేశంలోకి కొత్త వచ్చిన కరోనా వేరియంట్ జెఎన్.1 వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 358 మందికి కరోనా (కోవిడ్-19) సోకింది. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల (corona cases) సంఖ్య 2,669కి చేరడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4,44,70,576 పాజిటివ్ కేసులు నమోదుకావడం జరిగింది. ఇందులో 5,33,327 మంది మరణించడం జరిగింది.

corona cases

కేరళలో మరో 300 కొత్త corona cases నమోదు

కోవిడ్ JN.1 వేరియంట్ యొక్క కొత్త కేసులు ప్రధానంగా కేరళ, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు మరియు మహారాష్ట్రలలో నమోదుకావడం జరిగింది. గత 24 గంటల్లో కేరళలో కరోనా బాధితులు ముగ్గురు, కర్ణాటక లో 2, పంజాబ్ లో ఒకరు మరణించారు.

అంతేకాకుండా కేరళ రాష్ట్రంలోనే మరో 300 కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగించే విషయం. కాగా మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం మరియు మరణాల రేటులు 1.18 శాతంగా ఉన్నాయని వైద్య శాఖ వెల్లడించింది.

Also Read: తెలంగాణలో 6 కొత్త కరోనా కేసులు నమోదు..