Home   »  జాతీయం   »   మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎంకు మరోసారి ED నోటీసులు

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎంకు మరోసారి ED నోటీసులు

schedule mahesh

Arvind Kejriwal | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.

arvind-kejriwal-ed-again-notices-delhi-cm-in-liq

Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఢిల్లీ CM, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కి మరోసారి సమన్లు జారీ చేయడం జరిగింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ED అధికారులు ఇప్పటికే నాలుగుసార్లు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ కేజ్రీవాల్ మాత్రం ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. తాజాగా ED ఐదోసారి సమన్లు జారీ చేసింది. అందులో ఫిబ్రవరి 2న హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

Arvind Kejriwal ఫిబ్రవరి 2న విచారణకు హాజరు కావాలన్న ED

గ‌తంలో నవంబర్ 2, డిసెంబర్ 21, ఆపై జనవరి 3న కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చిన ED అధికారులు ఆ తర్వాత జనవరి 13న నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే కేజ్రీవాల్ నాలుగుసార్లు ED నోటీసులను పట్టించుకోలేదు. ED నోటీసులు చట్టవిరుద్ధమని మండిపడ్డారు. తనను అరెస్టు చేసే కుట్రలో భాగంగానే నోటీసులు పంపుతున్నారని కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ED మరోసారి నోటీసులు జారీ చేసింది. తాజా నోటీసులపై కేజ్రీవాల్‌ నుండి ఎలాంటి స్పందన రాలేదు.

Also Read | జార్ఖండ్ CM హేమంత్‌ సోరెన్‌ను విచారిస్తున్న ED అధికారులు..