Home   »  జాతీయం   »   ED విచారణకు 7వ సారీ డుమ్మాకొట్టిన కేజ్రీవాల్..!

ED విచారణకు 7వ సారీ డుమ్మాకొట్టిన కేజ్రీవాల్..!

schedule mahesh
arvind-kejriwal-to-skip-7th-probe-agency-summons

Arvind kejriwal | ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ED (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణకు మరోసారి హాజరుకాలేదు. ఈ కేసులో ED ఇప్పటికే ఆరుసార్లు నోటీసులు జారీ చేసినా కేజ్రీవాల్ మాత్రం వాటిని పట్టించుకోలేదు.

కోర్టు నిర్ణయం కోసం ED వేచి ఉండాలన్న AAP

తాజాగా ED ఏడోసారి సమన్లు జారీ చేయగా కేజ్రీవాల్ వాటిని సైతం బేఖాతరు చేశారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు చేసింది. ED న్యాయ ప్రక్రియను గౌరవించాలని ఆప్ సూచించింది. కేజ్రీవాల్‌కు పదేపదే సమన్లు జారీ చేయకుండా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కోర్టు తీర్పు కోసం వేచిచూడాలని ఆప్ కోరింది.

మార్చి 16న విచారించనున్న కోర్టు

కాగా, ED ఇప్పటివరకు పలుసార్లు సమన్లు జారీ చేయగా, కేజ్రీవాల్‌ వాటిని చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంటూ కొట్టిపారేస్తూవస్తున్నారు. ఈ విషయంపై ED కోర్టును ఆశ్రయించింది. అయితే ఢిల్లీ బడ్జెట్‌ సమావేశాల వల్ల ప్రత్యక్షంగా కోర్టు విచారణకు హాజరు కాలేకపోతున్నాని కేజ్రీవాల్ తెలిపారు. దీంతో కోర్టు విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.

Also Read | కేజ్రీవాల్‌కు 7వ సారి సమన్లు జారీ చేసిన ED..!