Home   »  జాతీయం   »   బీహార్ స్పీకర్‌ పదవి కోల్పోయిన అవధ్‌ బిహారీ..!

బీహార్ స్పీకర్‌ పదవి కోల్పోయిన అవధ్‌ బిహారీ..!

schedule mahesh

Awadh Bihari | బీహార్ అసెంబ్లీ స్పీకర్, RJD నాయకుడు అవధ్ బిహారీ చౌదరిపై నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.

awadh-bihari-lost-the-post-of-speaker-of-bihar

Awadh Bihari | బీహార్ అసెంబ్లీ స్పీకర్, RJD నాయకుడు అవధ్ బిహారీ చౌదరిపై నితీష్ కుమార్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా 125 మంది, వ్యతిరేకంగా 112 మంది ఓటు వేయడం జరిగింది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందడంతో అవధ్ బిహారీ తన పదవిని కోల్పొయారు.

అవిశ్వాస తీర్మానంతో పదవిని కోల్పోయిన అవధ్ బిహారి

RJD, కాంగ్రెస్, JDU లతో కూడిన మహాకూటమి ప్రభుత్వంలో అవధ్ బిహారీ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నిక కావడం జరిగింది. అయితే తాజాగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూటమికి గుడ్ బై చెప్పి NDAలో చేరారు. NDA తరపున మరోసారి నితీశ్ కుమార్ CMగా ఎన్నికయ్యారు. అయితే స్పీకర్ అవద్ బిహారీ తన పదవికి రాజీనామా చేయలేదు. ఈరోజు అవిశ్వాస తీర్మానంతో ఆయనను పదవి నుంచి తప్పించారు.

తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు రాగ వ్యతిరేకంగా 112 ఓట్లు

ప్రస్తుతం నితీశ్‌ కుమార్ ప్రభుత్వంపై పెట్టిన విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన ఓటింగ్‌ను బట్టి తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 112 ఓట్లు వచ్చాయి.

Also Read | కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ సీఎం..!