Home   »  జాతీయం   »   కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..!

కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..!

schedule mahesh

CM Mamata Banerjee | వారణాసిలో ప్రధాని మోదీని ఓడించే దమ్ము కాంగ్రెస్‌ పార్టీకి ఉందా అని పశ్చిమ బెంగాల్ CM, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ (CM Mamata Banerjee) ప్రశ్నించారు.

bengal-cm-mamata-banerjee-lashed-out-congress-!

CM Mamata Banerjee | వారణాసిలో ప్రధాని మోదీని ఓడించే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా అని పశ్చిమ బెంగాల్ CM, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ప్రశ్నల వర్షం కురిపించారు. కోల్‌కతాలోని ముర్షిదాబాద్‌లో జరిగిన ఓ సభలో మమత బెనర్జీ ప్రసంగిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో 300 స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్‌ చెప్తుంది. ఈ 300 సీట్లలో కనీసం 40 సీట్లు అయిన గెలుస్తుందన్న నమ్మకం నాకు లేదన్నారు. నిజంగా కాంగ్రెస్‌కు దమ్ము ఉంటే వారణాసిలో ప్రధాని మోదీని ఓడించి చూపెట్టాలన్నారు.

దమ్ముంటే వారణాసిలో మోదీని ఓడించి చూపెట్టాలన్న మమతా

వారణాసి అనే కాకుండా ఒక్కొక్కటి చెప్తూ పోతే ఎన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీ గెలువగలదో చెప్పే దమ్ము ఆ పార్టీకి ఉందా అని ప్రశ్నించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన స్థానాల్లో కూడా ఈసారి కాంగ్రెస్‌ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ పనైపోయిందన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన న్యాయ్‌యాత్రను ఉద్దేశించి మమత బెనర్జీ స్పందిస్తూ ప్రస్తుతం కొత్త వేషగాళ్లు ఊర్లుపట్టుకొని తిరుగుతున్నారు. కనీసం చాయ్‌ దుకాణానికి వెళ్లడానికి ఇష్టపడనివాళ్లు ఇప్పుడు బీడీ కార్మికులతో ఫొటోలకు పోజులిస్తూ వలస పక్షులవలె తిరుగుతున్నారు అని విమర్శించారు.

బెంగాల్ కు రావాల్సిన నిధులను విడుదల చేయాలి: మమతా బెనర్జీ

ప్రస్తుతం నడుస్తున్నదంతా ఫొటోషూట్‌ మాత్రమేనని మమత మండిపడ్డారు. బెంగాల్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో మమతా బెనర్జీ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పలు పథకాలకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు రావాలన్నారు. బకాయిలు విడుదల చేయాలని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం స్పందించడం లేదన్నారు.

Also Read | “INS సంధాయక్‌” నౌకను జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి.!