Home   »  జాతీయం   »   ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం

schedule raju

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. ఒకేసారి 2 విమానాల టేకాఫ్‌, ల్యాండింగ్‌కు ATC అనుమతి ఇచ్చింది. చివరి నిమిషంలో గుర్తించి ఒక విమానం టేకాఫ్‌ను రద్దు చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ 2 విమానాలు విస్తారా సంస్థకు చెందినవే. ఢిల్లీ నుంచి బెంగాల్‌లోని బగ్‌దోరాకు వెళ్తున్న యూకే725 ఫ్లైట్ టేకాఫ్‌కు సిద్ధమవ్వగా.. అహ్మదాబాద్‌ నుంచి ఢిల్లీ వస్తున్న విమానం ల్యాండింగ్‌కు అనుమతించడం గందరగోళానికి కారణమైంది.

అయితే ఒకేసారి రెండింటికి సిగ్న‌ల్స్ ఇవ్వ‌డంతో.. ర‌న్‌వేపై ఆ రెండు విమానాలు ఢీకొనే ప‌రిస్థితి ఏర్ప‌డింది. కానీ ATC చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఆ ప్ర‌మాదం త‌ప్పింది. అబార్ట్ సంకేతాలు ఇవ్వ‌డంతో బ‌గ్‌దోరా విమానం.. రన్‌వే నుంచి పార్కింగ్ బేకు వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టి వ‌ర‌కు విస్తారా ఎయిర్‌లైన్స్ సంస్థ ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.