Home   »  జాతీయం   »   ఇకపై ఎప్పటికి NDA కూటమిని వీడనన్న బీహార్ CM

ఇకపై ఎప్పటికి NDA కూటమిని వీడనన్న బీహార్ CM

schedule mahesh

Bihar CM | బీహార్ ముఖ్యమంత్రి, JDU అధినేత నితీశ్ కుమార్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇకపై ఎప్పటికీ NDA కూటమిలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

bihar-cm--will-never-leave-nda-alliance

Bihar CM | బీహార్ CM, JDU అధినేత నితీశ్ కుమార్ తాజాగా ఇకపై తాను ఎప్పటికి NDA కూటమిలోనే కొనసాగుతానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రెండు సార్లు NDA కూటమి నుంచి వైదొలిగే ఉండొచ్చు కానీ ఇకపై అలా చేయబోనని చెప్పారు.

NDA కూటమిని వీడనన్న Bihar CM

ఇటీవలే మహాకూటమిలోని RJDతో తెగతెంపులు చేసుకున్న నితీశ్ కుమార్ BJPతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. ఈ నేపథ్యంలో బుధవారం నితీష్ మొదటిసారిగా ప్రధాని మోదీని కలిశారు. మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డాతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడటం జరిగింది.

BJPతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నితీష్

NDA కూటమితో బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసాము. ఈ కూటమి ప్రధాన లక్ష్యం ప్రజలకు సేవ చేయడమేనని, కేంద్రం, రాష్ట్రంలోని NDA సంకీర్ణ ప్రభుత్వంతోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని నితీష్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమర్ధవంతమైన నాయకత్వంలో రాష్ట్రంలోని NDA ప్రభుత్వం నిరంతర అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకుంటుందని నేను విశ్వసిస్తున్నానని నితీష్ పేర్కొన్నారు. 2013లో NDA తో తెగతెంపులు చేసుకోవడానికి ముందు 1995 నుండి BJPతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా నితీశ్ గుర్తు చేసుకున్నారు.

2013లో నేను NDA కూటమితో బంధాన్ని తెంచుకున్నాను. అయితే అంతకంటే ముందు 1995 నుండి 2013 వరకు మా JDU పార్టీ BJPకి మిత్రపక్షంగానే కొనసాగింది. ఇప్పటిదాకా రెండుసార్లు NDAను విడిచిపెట్టాను. ఇకపై అలా ఎప్పటికీ జరగదు, ఎప్పటికీ NDA కూటమిని వదలనన్నారు. NDA కూటమిలోనే కొనసాగుతూ రాష్ట్ర ప్రజ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తామ‌న్నారు.

Also Read | Rajasthan | 100 అడుగుల బోరుబావిలో పడ్డ మహిళ