Home   »  జాతీయం   »   బిల్కిస్ బానో అత్యాచార నిందితులకు సుప్రీంలో చుక్కెదురు..!

బిల్కిస్ బానో అత్యాచార నిందితులకు సుప్రీంలో చుక్కెదురు..!

schedule mahesh

Supreme Court | బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషులకు సుప్రీంకోర్టులో ఊర‌ట లభించలేదు. ఈ ఆదివారం నాటికి 11 మంది దోషులు లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లొంగిపోవడానికి మరికొంత సమయం కావాలంటూ నిందితులు వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

bilkis-bano-accuses-accused-in-the-supreme-court

Supreme Court | బిల్కిస్ బానో రేప్ కేసులో 11 మంది నిందితులను సుప్రీంకోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ ఆదివారం నాటికి దోషులందరూ లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. లొంగిపోవడానికి మరికొంత సమయం ఇవ్వాలని దోషులు కోర్టును అభ్యర్థించారు. అయితే వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

బిల్కిస్ బానో అత్యాచార నిందితులకు సుప్రీంలో చుక్కెదురు

2002 గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేశారనే ఆరోపణలతో 11 మంది నిందితులు జైలు పాలయ్యారు. అయితే ఇటీవల వారు క్షమాభిక్ష ఆధారంగా జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలను సవాల్ చేస్తూ బిల్కిస్ బానో కోర్టును ఆశ్రయించారు.

మరోసారి లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసిన Supreme Court

ఆమె పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు దోషులను మరోసారి లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లిన దోషులకు ఎదురుదెబ్బ తగిలింది. జస్టిస్ BV నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. పిటిషనర్ల వాదనలో ఎలాంటి అర్హత లేదని, దోషులు మళ్లీ జైలుకు వెళ్లాలని కోర్టు పేర్కొంది. బిల్కిస్ బానో కేసు దోషులను అక్రమంగా విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read | అయోధ్యలో అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసిన ATS స్క్వాడ్‌