Home   »  జాతీయం   »   బీజేపీ ప్రభుత్వం అత్యంత అవినీతిలో కూరుకుపోయింది : శివపాల్ సింగ్

బీజేపీ ప్రభుత్వం అత్యంత అవినీతిలో కూరుకుపోయింది : శివపాల్ సింగ్

schedule mahesh

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో అవినీతిని అంతమొందిస్తామని హామీ ఇచ్చి రాష్ట్రంలో బీజేపీ (BJP government) అధికారంలోకి వచ్చిందని, అయితే అదే అత్యంత అవినీతి ప్రభుత్వమని తేలిందని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత శివపాల్ సింగ్ యాదవ్ పేర్కొన్నారు.

BJP government అత్యంత అవినీతి ప్రభుత్వం:శివపాల్ సింగ్ యాదవ్

త్రివేదిగంజ్‌ బ్లాక్‌లోని సాహ్‌ మనోధర్‌పూర్‌ గ్రామంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలకు భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఆయన శుక్రవారం సాయంత్రం ఇక్కడ ఈ వ్యాఖ్యలు చేయటం జరిగింది. అవినీతి అంతం చేస్తామంటూ బీజేపీ ఏడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చింది. కానీ అదే అత్యంత అవినీతి ప్రభుత్వం అని ఆయన అన్నారు.

రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాధారణ కార్యకర్త కూడా తన పనిని సులువుగా పూర్తిచేసుకునేవారని అయితే ఇప్పుడు ఎంపీ లేదా ఎమ్మెల్యే సిఫార్సు చేసినా కమిషన్ లేకుండా ఏమీ జరగదని ఎస్పీ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

పోలీసు స్టేషన్లు లేదా తహసీల్‌లు ప్రజల ఫిర్యాదులను వినడం లేదన్న శివపాల్

పోలీసు స్టేషన్లు లేదా తహసీల్‌లు ప్రజల ఫిర్యాదులను వినడం లేదని ఆయన అన్నారు.ప్రస్తుత ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయిందని, దేశం మొత్తం బ్యూరోక్రసీ చేతుల్లో ఉందని తెలిపారు.

వెనుకబడిన తరగతుల ప్రజలను, ముఖ్యంగా ముస్లింలను బిజెపి అణచివేస్తోందని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సీట్ల పంపకంపై కాంగ్రెస్, ఎస్పీల మధ్య విభేదాల గురించి అడిగిన ప్రశ్నకు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి దింపేందుకు ఇండియా గ్రూప్ పనిచేస్తుందని అన్నారు.