Home   »  జాతీయం   »   Cabinet |మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన క్యాబినెట్…!

Cabinet |మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన క్యాబినెట్…!

schedule mahesh

NEW DELHI: చారిత్రాత్మక చర్యగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నిన్న జరిగిన కేంద్ర Cabinet సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది.

రేపు జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీని అర్థం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి.

ఈ బిల్లు ఫై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చలు సజావుగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. కాంగ్రెస్‌తో సహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకి మద్దతుగా ఉన్నాయి.

మహిళా రిజర్వేషన్ బిల్లుకి Cabinet ఆమోదం

వాస్తవానికి ప్రత్యేక పార్లమెంటు సమావేశంలో ఈ బిల్లుని ఆమోదించాలని మోడీ ప్రభుత్వం పై ప్రతి పక్ష కాంగ్రెస్ ఒత్తిడి చేస్తోంది.

5రోజుల పాటు జరగనున్న ఈ పార్లమెంట్ సమావేశాల్లో 8 బిల్లుల పై చర్చ జరుగుతుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.

వీటితోపాటు “వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ ” పేరును మార్చే బిల్లును కూడా తీసుకువస్తారనే ప్రచారం జోరందుకుంది.

ఇదిలావుండగా నిన్నప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 22వ తేదీ వరకు జరగనున్నాయి.

తొలిరోజు సమావేశాలు పాత భవనంలోనే జరగ్గా రెండో రోజు అంటే ఈ రోజు నుంచి కొత్త భవనంలో సమావేశాలు జరగనున్నాయి.