Home   »  జాతీయం   »   J&K మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసంలో CBI సోదాలు..!

J&K మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసంలో CBI సోదాలు..!

schedule mahesh
cbi-raid-on-former-governor-satyapal-malik-house

Former Governor SatyaPal Malik | జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసంలో CBI అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు అవినీతి కేసులో తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏకకాలంలో 30 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి.

సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్న 100 మంది అధికారులు

ఉదయం ప్రారంభమైన ఈ సెర్చ్ ఆపరేషన్‌లో దాదాపు 100 మంది అధికారులు పాల్గొన్నట్టు తెలుస్తుంది. కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ సివిల్ పనుల కేటాయింపుల్లో రూ.2,200 కోట్ల అవినీతి జరిగినట్లు కేసు నమోదైంది. సత్యపాల్ మాలిక్ ఆగస్టు 2018 నుంచి అక్టోబర్ 2019 వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా కొనసాగారు.

ఆ సమయంలో ఆయన వద్దకు రెండు ఫైళ్లు వచ్చాయని వాటిపై సంతకం చేస్తే రూ.300 కోట్లు వస్తాయని తన కార్యదర్శులు చెప్పారని అందులో హైడ్రో ప్రాజెక్ట్ ఫైల్ ఉందని గతంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఈరోజు జరుగుతున్న సోదాలపై సత్యపాల్ మాలిక్ “X “వేదికగా స్పందిస్తూ అనారోగ్య కారణాల రీత్యా తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. తాను అనారోగ్యంతో ఉన్నప్పటికీ తన నివాసంపై నిరంకుశ శక్తులు దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు.

Also Read | BRS MLC కవితకు మరోసారి CBI నోటీసులు..!