Home   »  జాతీయం   »   Central Government |కేంద్రం సంచలన నిర్ణయం

Central Government |కేంద్రం సంచలన నిర్ణయం

schedule mahesh

NEW DELHI: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన Central Government కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

కేంద్రం సంచలనం నిర్ణయం తీసుకుంది. ఉజ్వల యోజన కింద మహిళలకు వచ్చే మూడేళ్లలో మరో 75 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్‌లను ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

దీని వల్ల Central Government రూ.1650 కోట్ల భారం పడనుందని Central మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇక ఇటీవలే గ్యాస్ సిలిండర్ల పై రూ.200లు, ఉజ్వల పథక లబ్ధిదారులకు రూ.400లను కేంద్రం తగ్గించింది.

ఇంకొద్దిరోజుల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఆరంభం కాబోతోన్నాయి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ పార్లమెంట్ సమావేశాలు నాంది పలికే అవకాశాలు ఉన్నాయి.

ఓటర్లను ఆకట్టుకునే దిశగా కేంద్రం ఈ సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు, బిల్లులను ప్రవేశపెడుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు అంటే అయిదు రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలను ప్రత్యేకంగా సమావేశపర్చనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇది వరకే వెల్లడించారు.

అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం లేదా, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఎన్నికల జోష్‌ను మరింత పెంచేలా ఉందా ఆ నిర్ణయం.

దేశవ్యాప్తంగా 75 లక్షల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లను ఉచితంగా మంజూరు చేయనుంది. వచ్చే మూడు సంవత్సరాల కాలంలో అంటే 2026 నాటికి ఈ 75 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్ల జారీ ప్రక్రియను పూర్తి చేయనుంది.

సంవత్సరానికి 25 లక్షలు చొప్పున గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేస్తుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద వాటిని కేటాయిస్తుంది.

దీనితో ఉజ్వల యోజన పథకం కింద మంజూరయిన ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 10.35 కోట్లకు చేరుకుంటుంది.

కాగా రూ.7,210 కోట్ల రూపాయలతో ఈ-కోర్టుల ప్రాజెక్ట్ ఫేజ్ 3కీ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.