Home   »  జాతీయం   »   LK అద్వానీకి భారతరత్న ప్రకటించిన భారత ప్రభుత్వం

LK అద్వానీకి భారతరత్న ప్రకటించిన భారత ప్రభుత్వం

schedule mahesh

LK Advani | దేశ మాజీ ఉప ప్రధాని, BJP అగ్రనేత LK అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది.

advani-awarded-bharat-ratna-by-government-india

LK Advani | మాజీ ఉప ప్రధాని, BJP అగ్రనేత LK అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదిక అయిన (X)లో ఈ విషయాన్ని తెలిపారు.

Advaniకి భారతరత్న ప్రకటించిన భారత ప్రభుత్వం

LK అద్వానీకి భారతరత్న లభించడం సంతోషంగా ఉందని మోదీ తెలియజేశారు. ఈ సందర్భంగా దేశానికి అద్వానీ చేసిన సేవలను కొనియాడారు. అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని, దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. అద్వానీకి ఫోన్ చేసి అత్యున్నత పురస్కారం అందుకున్నందుకు అభినందనలు తెలిపినట్లు మోదీ ట్వీట్‌లో తెలిపారు.

1927లో కరాచీలో జన్మించిన లాల్ కృష్ణ అద్వానీ

లాల్ కృష్ణ అద్వానీ 1927లో కరాచీలో జన్మించారు. దేశ విభజన సమయంలో భారతదేశానికి వలస వచ్చి బొంబాయిలో స్థిరపడ్డాడు. బొంబాయిలో కాలేజీ విద్యను పూర్తి చేశాడు. అతను 14 సంవత్సరాల వయస్సులో (1941 లో) RSS లో చేరి రాజస్థాన్ ప్రచారక్‌గా పనిచేశాడు. అతను 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జన్ సంఘ్‌లో చేరాడు. పార్లమెంటరీ వ్యవహారాల ఇన్‌చార్జి, జనరల్ సెక్రటరీ మరియు ఢిల్లీ యూనిట్ ప్రెసిడెంట్‌తో సహా వివిధ హోదాలలో పని చేసారు.

నాలుగు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన అద్వానీ

1966లో జరిగిన ఢిల్లీ మెట్రోపాలిటన్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో గెలుపొందారు. తర్వాతి ఏడాది 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్‌ కౌన్సిల్‌ అధ్యక్షడిగా ఎన్నికయ్యాడు. 1970 వరకూ RSS జాతీయ కార్యవర్గ సభ్యునిగా పని చేశారు. ఇక 1970లో అద్వానీ తొలిసారి రాజ్యసభకు ఎన్నిక కావడం జరిగింది. 1989 వరకూ నాలుగు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగడం జరిగింది.

2002 – 2004 వరకు ఉప ప్రధానిగా పనిచేసిన అద్వానీ

1989లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఉభయసభల్లో ప్రతిపక్ష నేతగానూ బాధ్యతలు నిర్వర్తించారు. 1998 – 2002 మధ్య హోం వ్యవహారాల మంత్రిగా, 2002 – 2004 వరకు ఉప ప్రధాన మంత్రిగా పనిచేసారు. ఇక 2015లో అద్వానీ భారతదేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను అందుకొన్నారు.

Also Read | కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..!