Home   »  జాతీయం   »   ఇంధ‌న ధ‌ర‌లపై కేంద్ర మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు..!

ఇంధ‌న ధ‌ర‌లపై కేంద్ర మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు..!

schedule mahesh

fuel prices: పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించనుందనే ప్రచారం జరుగుతోంది. పెట్రోలు మంటల నుంచి సామాన్యులకు కొంత ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్ ధరలను లీట‌ర్‌కు రూ.10 వ‌ర‌కూ త‌గ్గిస్తార‌నే అనుకుంటున్నారు.

fuel prices

fuel prices తగ్గే అవకాశం లేదన్న మంత్రి హర్దీప్ పూరి

సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి సత్తా చాటేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గిస్తుందన్న వార్తలపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ పూరి నోరు విప్పారు. ఇంధన ధరలపై బుధవారం ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. చమురు ధరల్లో తీవ్ర అనిశ్చితి నెలకొనడంతో రానున్న రోజుల్లో ఇంధన ధరలు తగ్గే అవకాశం లేదని మంత్రి తెలిపారు. పెట్రోల్ ధరలు తగ్గుతాయన్న వార్తలు ఊహాగానాలేనని కొట్టిపారేశారు.

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం బ్యారెల్ 75 డాల‌ర్లు

ఇంధన ధరలను తగ్గించే ప్రతిపాదన లేదని మంత్రి తెలిపారు. ఇంధనం అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆర్ధిక వ్య‌వ‌స్ధ వృద్ధికి చ‌మురు వినియోగ‌మే కీల‌కమ‌న్నారు. ముడిచమురు ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా నష్టపోయాయని అన్నారు. ఇక బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం బ్యారెల్ 75 డాల‌ర్లు పలుకుతుంది.

Also Read: 24 గంటల వ్యవధిలో 600 కు పైగా కొత్త కేసులు.. 5 మరణాలు