Home   »  జాతీయం   »   ED విచారణకు డుమ్మా కొట్టిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..!

ED విచారణకు డుమ్మా కొట్టిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..!

schedule mahesh

న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఈరోజు ఈడీ విచారణకు హాజరుకావాల్సిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) విచారణకు హాజరు కాలేదు. డిసెంబర్ 30 వరకు పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లా ఆనంద్‌గఢ్ గ్రామంలో విపాసన కోర్సుకు హాజరవుతారని ఆప్ జాతీయ కన్వీనర్ వెల్లడించారు.

CM Arvind Kejriwal

విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసిన ED

10 రోజుల పాటు కేజ్రీవాల్ రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండనున్నారని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈరోజు ఈడీ విచారణకు హాజరు కావాలని డిసెంబర్ 18న కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ విసాసన సెషన్‌లో పాల్గొనేందుకు కేజ్రీవాల్ మంగళవారం వెళ్లాల్సి ఉండగా ఇండియా అలయన్స్ మీటింగ్ నేపథ్యంలో ఆయన ప్లాన్ వాయిదా పడినట్లు తెలుస్తుంది.

ED విచారణకు డుమ్మా కొట్టిన CM Arvind Kejriwal

వాస్తవానికి నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమన్లు చట్టవిరుద్ధమని పేర్కొంటూ కేజ్రీవాల్‌ విచారణకు హాజరుకాలేదు. సమన్లు అందిన రోజే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయవచ్చని ఊహాగానాలు కూడా వచ్చాయి. రాజకీయ ప్రేరేపితమైనందున ఈ సమన్లను ఉపసంహరించుకోవాలని కేజ్రీవాల్ డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈడీ ఆయనకు రెండోసారి సమన్లు జారీ చేసింది.

Also Read: దేశంలో మరో 358 కరోనా కేసులు నమోదు.. 2669కి చేరిన యాక్టివ్‌ కేసులు