Home   »  జాతీయం   »   సీఎం కుమారునికి నోటీసులు జారీ చేసిన ED…!

సీఎం కుమారునికి నోటీసులు జారీ చేసిన ED…!

schedule mahesh

న్యూఢిల్లీ: రాజస్థాన్ లో ఎన్నికలకు ముందు రాజస్థాన్‌ అధికార పార్టీ కాంగ్రెస్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థలు వరుసగా షాక్‌లకు గురిచేస్తున్నాయి.

గురువారం ఉదయం టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ పేపర్‌ లీకేజీ కేసులో పార్టీ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఫారెన్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (FEMA) కింద ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌ గెహ్లాట్‌కు నోటీసులు జారీ చేయటం జరిగింది.

ఫారెన్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (FEMA) కింద నోటీసులు జారీ

ఈ నెల 27న శుక్రవారం రోజున జైపూర్‌లోని ED కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో తెలిపారు. ఫెమా నిబంధనలు అతిక్రమించి మనీ లాండరింగ్‌కు పాల్పడినందుకు గాను ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ట్రైటన్‌ హోటల్స్‌ & రిసార్ట్స్‌ ప్రవేట్‌ లిమిటెడ్‌పై ఈడీ కేసు నమోదు చేయడం జరిగింది.

CM Ashok Gehlot వైభవ్‌ గెహ్లాట్‌కు నోటీసులు జారీ చేసిన ED

ఇదే వ్యవహారంలో జైపూర్‌, ఉదయ్‌పూర్‌, ముంబై, ఢిల్లీలో అధికారులు గత ఆగస్టులో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ సంస్థ డైరెక్టర్‌ రతన్‌కాంత్‌ శర్మను, సీఎం గెహ్లాట్‌ (CM Ashok Gehlot ) కుమారుడు వైభవ్‌ వ్యాపార భాగస్వామిగా గుర్తించటం జరిగింది. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం వైభవ్‌కు సమన్లు జారీ చేసినట్టు తెలుస్తుంది.