Home   »  జాతీయం   »   చిత్రహింసలకు గురిచేసినందుకు కర్ణాటక పోలీసులపై ఫిర్యాదు..

చిత్రహింసలకు గురిచేసినందుకు కర్ణాటక పోలీసులపై ఫిర్యాదు..

schedule ranjith

బెంగళూరు | బెంగళూరులో ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసినందుకు కర్ణాటక పోలీసులపై ఫిర్యాదు నమోదైంది.

Complaint against Karnataka Police | Complaint against Karnataka police for torture

బెంగళూరులోని కోననకుంటె ప్రాంతానికి చెందిన వెంకట్‌ తనను అకారణంగా చిత్రహింసలకు గురిచేసినందుకు సబ్‌ఇన్‌స్పెక్టర్ సంతోష్ గౌడ్, పోలీస్ కానిస్టేబుళ్లు ధ్యాన్ ప్రకాష్, సచిన్‌లపై బెంగళూరు సిటీ పోలీస్‌ కమిషనర్‌, మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. వెంకట్‌ తను జనవరి 12న ముల్‌బాగల్‌ పట్టణానికి వెళ్లానని.. మణి అనే వ్యక్తి వద్ద నుంచి స్వగ్రామానికి చేరుకునేందుకు లిఫ్ట్‌ ఎక్కాతనుని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

వెంకట్‌కు అధికారుల బెదిరింపులు (Complaint against Karnataka Police)

పోలీసుల కథనం ప్రకారం… IPC సెక్షన్ 420 కింద నమోదైన కేసుకు సంబంధించి కాటన్‌పేట పోలీసులు మణి కోసం వెతుకుతున్నారు. పోలీసులు మణిని ట్రాక్ చేసి, వెంకట్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వెంకట్‌, మణి మధ్య ఎలాంటి సంబంధం లేకపోయినా వెంకట్‌ను మూడు రోజుల పాటు లాడ్జిలో ఉంచారు. విచారణ సందర్భంగా పోలీసులు తనను ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరించారని, ఉద్యోగం పోగొట్టేలా చేస్తామని అన్నారని వెంకట్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఉప్పర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు

వెంకట్‌ కుటుంబసభ్యులు బెంగళూరులోని ఉప్పర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టారు. ఉప్పర్‌పేట పోలీసులు అతడిని పట్టుకుని ఎట్టకేలకు విడుదల చేశారు. తనను అక్రమంగా నిర్బంధించారని, అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని, దాడి చేశారని, బెదిరించారని వెంకట్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Also Read | Punjab Crime News | భర్తను హతమార్చిన భార్య