Home   »  జాతీయం   »   Congress |యువత భవిష్యత్తును ప్రభుత్వం దోచుకుంది: ఖర్గే

Congress |యువత భవిష్యత్తును ప్రభుత్వం దోచుకుంది: ఖర్గే

schedule mahesh

న్యూఢిల్లీ: AICC కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతు భారతదేశంలోని 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లలో 42.3 శాతం మంది నిరుద్యోగులు గానే ఉండి పోయారంటూ, వారికి ఉపాధి లేకుండా చేయడం ద్వారా కేంద్రం ప్రభుత్వం వారి భవిష్యత్తును దోచుకుంటోందని ఆరోపించారు.

యువత ఇప్పుడు వారి ఈ దుస్థితికి కారణం ప్రభుత్వాన్ని బాధ్యులను చేయాల్సిన అవసరం ఉందని ఖర్గే అన్నారు.

సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం ఈ ప్రభుత్వం మోసం చేసింది : ఖర్గే (Congress)

సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి మా నిరుద్యోగ యువకుల హృదయాలలో, ఆశలు కల్పించి దానిని తుంగలో తొక్కారంటూ ఖర్గే విమర్శించారు.

గ్రాడ్యుయేషన్‌ నుంచి ఉద్యోగం సాధించే వరకు నిత్యం పోరాటాలేనని అదొక విషాదగాథ అని అన్నారు. యువత ఇప్పుడు ఈ విషయాలను తమ చేతుల్లోకి తీసుకోవాలి.

వారి ఈ దుస్థితికి ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచాలి. 10 ఏళ్లలో ఉపాధి కల్పించలేని ప్రభుత్వం ఇంకా వారికి ఎప్పటికీ ఉపాధి కల్పించదని నిరుద్యోగ యువతకి బాగా తెలుసు. భవిష్యత్తును కాపాడుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం యువత మీద ఉందని అన్నారు.