Home   »  జాతీయం   »   ఎన్నికల నేపథ్యంలో హామీల వర్షం కురిపిస్తున్న కాంగ్రెస్

ఎన్నికల నేపథ్యంలో హామీల వర్షం కురిపిస్తున్న కాంగ్రెస్

schedule mahesh

జైపూర్: ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్‌లో ప్రజలకు కాంగ్రెస్ (congress) శుక్రవారం మరో ఐదు హామీలను ప్రటించింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఛత్తీస్‌గఢ్ మాదిరిగానే గోధన్ హామీ పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.

ఛత్తీస్‌గఢ్ మాదిరిగానే గోదాన్‌ హామీ పథకం అమలు

కళాశాల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు కూడా అందజేస్తామని అన్నారు. రైతులకు ఛత్తీస్‌గఢ్‌ తరహాలో కాంగ్రెస్‌ (congress) ప్రభుత్వం గోదాన్‌ హామీ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపార. ఆవు పేడ కిలో రూ.2కే కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

కళాశాల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు

విద్యార్థులకు ప్రభుత్వ ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో ప్రవేశానికి లాటరీ అవసరం ఉండదని తెలిపారు.అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. యువతకు ప్రతి కళాశాలలో అడ్మిషన్‌తోపాటు ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్లెట్ ఇస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున విపత్తు నష్ట పరిహారం అందజేస్తామన్నారు.

రాష్ట్రంలోని ఉద్యోగులకు పాత పెన్షన్‌ను ఈ బడ్జెట్‌ సెషన్‌ నుంచి అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు O.PS గ్యారెంటీ కూడా అమలవుతుందని తెలిపారు. రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటి వరకు ఏడు హామీలను ప్రకటించింది.

మహిళలకి ప్రతి సంవత్సరం రూ. 10,000 ఆర్థిక సహాయం

రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బహిరంగ సభలో రెండు హామీలను ఇచ్చారు. అవి కుటుంబ పెద్ద మహిళలకి ప్రతి సంవత్సరం రూ. 10,000 ఆర్థిక సహాయం మరియు గృహ లక్ష్మి గ్యారెంటీ పథకం కింద రూ. 500 L.PG సిలిండర్‌ను ఇస్తామని తెలిపారు.

త్వరలో కాంగ్రెస్ (congress) మేనిఫెస్టో విడుదల

ఈ హామీలతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా త్వరలో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధాని మోదీకి అర్థం కావడం లేదని, అయితే బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో కౌంట్‌డౌన్‌ మొదలైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్రం నిబంధనల ప్రకారం కరువు భత్యం కూడా పెంచుతామని ముఖ్యమంత్రి తెలిపారు.

దీని వల్ల 8 లక్షల మంది ఉద్యోగులు, 4.40 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఏడాది చివర్లో అంటే నవంబర్‌లో రాజస్థాన్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి.