Home   »  జాతీయం   »   రెజ్లర్లకు మద్దతు తెలిపిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

రెజ్లర్లకు మద్దతు తెలిపిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

schedule mahesh

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం రెజ్లర్లతో సమావేశమయ్యారు. హర్యానాలోని ఝజ్జర్ జిల్లాకు చెందిన వీరేందర్ అఖాడాలో ప్రాక్టీస్ చేస్తున్న రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బజరంగ్ పునియా తమ సమస్యలను రాహుల్‌కు తెలిపారు.

Rahul Gandhi

తమ అవార్డులను తిరిగిచ్చేసిన అగ్రశ్రేణి రెజ్లర్లు

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎంపికయ్యాడు. ఈ ఎన్నికలు మల్లయోధులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఎన్నికల ఫలితాలకు నిరసనగా పలువురు అగ్రశ్రేణి రెజ్లర్లు తమ అవార్డులను వాపసు చేయడం జరిగింది.

క్రీడలకు రిటైర్మెంట్ ప్రకటించిన సాక్షి మాలిక్

సంజయ్ ఎన్నికపై విచారం వ్యక్తం చేస్తూ సాక్షి మాలిక్ ఇప్పటికే క్రీడలకు రిటైర్మెంట్ ప్రకటించింది. బజరంగ్ పునియా, వీరేందర్ యాదవ్ పద్మశ్రీ అవార్డులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేసారు. వినేష్ ఫోగట్ ఇప్పటికే ఖేల్ రత్న, అర్జున అవార్డులను తిరిగిచ్చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో వారికి రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించడం ప్రాధాన్యత నెలకొంది.

రెజ్లర్ల నిరసనకు మద్దతు తెలిపిన Rahul Gandhi

కాగా రెజ్లర్ల నిరసనతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం సంజయ్ సింగ్ ప్యానెల్‌ను సస్పెండ్ చేయడం జరిగింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కూడా తనకు రెజ్లింగ్‌తో సంబంధం లేదని, ఈ క్రీడకు సెలవని ప్రకటించాడు.

Also Read: మోదీ రోడ్‌షోలో హింసకు పాల్పడండి… ఖలిస్థానీ టెర్రరిస్ట్ పిలుపు