Home   »  జాతీయం   »   మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల…!

మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల…!

schedule mahesh

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ లో నవంబర్ 17న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం “వచన్ పాత్రపేరుతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మంగళవారం మ్యానిఫెస్టో ను (Congress Manifesto) విడుదల చేయబోతుంది.

“వచన్ పాత్ర” పేరుతో Congress Manifesto విడుదలకు సిద్ధం

“వచన్ పాత్ర” లో ప్రతి వర్గానికి చెందిన ఓటర్లకు, యువత, మహిళలు మరియు సీనియర్ సిటిజన్లకు సైతం కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పథకాలను రూపొందించిందని తెలుస్తుంది. షెడ్యూల్డ్ తెగ, షెడ్యూల్డ్ కులాల ఓటర్లకు పార్టీ ప్రత్యేక ప్యాకేజీలను చేర్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

మ్యానిఫెస్టోను విడుదల చేయనున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు కమల్‌నాథ్‌

భోపాల్‌లోని రవీంద్ర భవన్‌లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కమల్‌నాథ్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సూర్జేవాలా ఈ మ్యానిఫెస్టో ను ఆవిష్కరిస్తారని పార్టీ అధికార ప్రతినిధి వెల్లడించారు.

నారీ సమ్మాన్ యోజన” కింద మహిళలకు నెలకు 1,500, పాత పెన్షన్ పథకం (OPS), 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వ్యవసాయ రుణమాఫీ వంటి 12 వాగ్దానాలను పార్టీ ఇప్పటికే వెల్లడించింది.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ధార్‌లో తన చివరి బహిరంగ ర్యాలీలో రెండు ప్రధాన ప్రకటనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత విద్య, నగదు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. 8వ తరగతి వరకు విద్యార్థులకు రూ.500 మరియు 11 మరియు 12వ తరగతి విద్యార్థులకు రూ.1,500 అందిస్తామని తెలిపారు.

యువతకు రూ. 8,000 వరకు నిరుద్యోగ భృతి

కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు స్థిరమైన నెలవారీ ఆదాయం, పంటలకు కనీస మద్దతు ధర, యువతకు రూ.8,000 వరకు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చే అవకాశం ఉందని అధికార ప్రతినిధి తెలిపారు.

2018లో కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిందని, అయితే కమల్‌నాథ్ 15 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండడంతో దానిని అమలు చేయలేకపోయారని పార్టీ కార్యకర్తలు వెల్లడించారు.