Home   »  జాతీయం   »   Drugs |డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్…!

Drugs |డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్…!

schedule mahesh

పంజాబ్ : పంజాబ్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ శాసనసభ్యుడు, ఆప్ తిరుగుబాటుదారుడు సుఖ్‌పాల్ సింగ్ ఖైరా డ్రగ్స్ (Drugs) కేసులో ఈ చండీగఢ్ లో తన నివాసంలో అరెస్టయ్యారు.

ఎస్పీ మంజీత్ సింగ్, డీఎస్పీ ఏఆర్ శర్మ నేతృత్వంలో పంజాబ్ పోలీసులు ఉదయం 6:30 గంటలకు అతని ఇంటి పై దాడి చేసి తర్వాత అరెస్టు చేశారు.

డ్రగ్స్ కేసులో అరెస్టు (Drugs)

పోలీసులు అధికారికంగా కేసులను ధృవీకరించనప్పటికీ, సోషల్ మీడియాలో ఖైరా యొక్క ప్రత్యక్ష ప్రసార వీడియో అతనికి పాత నార్కోటిక్ డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్నందున పట్టుకున్నట్లు తెలుస్తుంది.

ఎస్పీ మంజీత్ సింగ్, డీఎస్పీ ఏఆర్ శర్మ నేతృత్వంలో అరెస్ట్

ఎస్పీ మంజీత్ సింగ్, డీఎస్పీ ఏఆర్ శర్మ నేతృత్వంలోని సిట్‌ సిఫారసు మేరకు అతడిని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడం పై ఖైరా నిరసన వ్యక్తం చేసారు.

ఖైరా పంజాబ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అరెస్ట్ చేయబడాడ్డు. ఖైరాను జలాలాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నట్లు పోలీసులు ఖైరా కొడుకు మెహతాబ్ ఖైరాకు తెలియ చేసారు

మెహతాబ్ ఖైరా తన తండ్రి అరెస్ట్ తర్వాత ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ, అందరికీ నమస్కారం 8 ఏళ్ల క్రితం జరిగిన డ్రగ్స్ కేసులో పంజాబ్ సీఎం ఆదేశాల మేరకు నా తండ్రి సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలియజేసారు.

ఖైరా అరెస్టును ఖండించిన కాంగ్రెస్

పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్యను పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఒక MLA ను అరెస్టు చేయడం చాలా శోచనీయం. ఆప్ ప్రభుత్వం వారి ప్రతీకార రాజకీయాల కోసం ఇంతకీ దిగజారిందని ఆరోపించారు.

ఖైరా ఒక మంచి విలువలతో కూడిన రాజకీయ నాయకుడు , మాన్ ప్రభుత్వం యొక్క తప్పులు , అక్రమాలకు వ్యతిరేకంగా తన గొంతుని పెంచినందుకు ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యగా అరెస్ట్ చేసిందని విమర్శించింది. ఖైరా అరెస్టు పై పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ ఆప్‌ పై మండిపడ్డారు.

.