Home   »  జాతీయం   »   మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

schedule mahesh

న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయం ఉండడంతో అభ్యర్థుల ఖరారు కోసం శుక్రవారం రోజున కాంగ్రెస్ (congress) పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన మూడోసారి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం జరిగింది.

ఖర్గే అధ్యక్షతన మూడోసారి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపిన వివరాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన, సీపీపీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, రాష్ట్ర శాఖ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తుంది.

congress లో చేరిన బీఆర్‌ఎస్‌ నేతల అభ్యర్థిత్వంపై విస్తృతంగా చర్చ

అక్టోబర్ 25న జరిగిన సమావేశంలో కనీసం 35 అసెంబ్లీ స్థానాలపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది.
గత నెలరోజులుగా కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నేతల అభ్యర్థిత్వంపై విస్తృతంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది.

గెలుపు ప్రాతిపదికన ఆయా స్థానాల్లోని బీఆర్‌ఎస్‌ నేతలు, ఇతర నేతలకు స్థానం కల్పించేందుకు నాయకత్వం సవివరంగా చర్చించిందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో అధిష్టానం అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగబోతుంది.