Home   »  జాతీయం   »   CPR: పాముకు CPR చేసి కాపాడిన కానిస్టేబుల్..

CPR: పాముకు CPR చేసి కాపాడిన కానిస్టేబుల్..

schedule ranjith

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సరైన సమయంలో CPR ఇచ్చి ప్రాణాలను కాపాడవచ్చని అందరికీ తెలుసు. చాలా మంది CPR ద్వారా ఎంతో మందికి ప్రాణాలు పోసిన సందర్భాలను చూశాం. మనుషులకే కాదు పాములకు కూడా CPR ద్వారా ప్రాణం పోయొచ్చని కానిస్టేబుల్ తెలిపారు.

మధ్యప్రదేశ్ లో ఘటన.. వీడియో వైరల్

మనుషులకే కాదు పాములకు కూడా C P R ద్వారా ప్రాణం పోయొచ్చని మధ్యప్రదేశ్ కు చెందిన కానిస్టేబుల్ తెలిపారు. వాటి నోట్లో గాలి ఊదడం ద్వారా చనిపోయాయనుకున్న చాలా పాములను తాను కాపాడానని చేపారు. తాజాగా ఓ పాముకు ఆయన C P R చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పురుగుల మందు కలిపిన నీళ్లను తాగి చలనం లేకుండా పడి ఉన్న ఆ పాములో మళ్లీ కదలిక రావడం ఈ వీడియోలో కనిపించింది. అయితే, నిపుణులు మాత్రం C P R ద్వారా పాములు బతకవని, ఈ సంఘటనలో ఆ పాము తనకు తానుగానే మళ్లీ స్పృహలోకి వచ్చి ఉంటుందని చెప్పారు.

ఆ నీళ్లు తాగి కదలిక లేకుండా పడి ఉన్న పాము

నర్మదాపురం పట్టణంలోని ఓ కాలనీలోకి పాము చొరబడింది. ఓ ఇంట్లోని పైప్ లైన్ లో చేరింది. దీనిని బయటకు వెళ్లగొట్టేందుకు ఆ ఇంటివాళ్లు విషం కలిపిన నీళ్లను పైపులోకి పంపించారు. ఆ నీళ్లు తాగిన పాము కాసేపటికి బయటపడింది. అయితే, పాములో చలనం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. డిపార్ట్ మెంట్ లో పాములను కాపాడే కానిస్టేబుల్ అతుల్ శర్మ అక్కడికి చేరుకుని పామును పరిశీలించారు.

కానిస్టేబుల్ CPR చేయడంతో పాములో కదలిక

ఆ పాము విషపూరితం కాదని, కొన ఊపిరితో ఉందని గుర్తించి C P R చేశాడు. పాము నోట్లో నోరు పెట్టి గాలి ఊదారు. కాసేపు ప్రయత్నించిన తర్వాత ఆ పాము కళ్లు తెరిచింది. మరికాసేపటికి పూర్తిగా స్పృహలోకి వచ్చిన ఆ పామును అడవిలో వదిలేసినట్లు అతుల్ శర్మ చేపారు. డిస్కవరీ ఛానెల్ చూస్తూ ఈ C P R పద్ధతి గురించి తెలుసుకున్నానని, గత పదిహేనేళ్లలో దాదాపు 500 లకు పైగా పాములను ఇలాగే కాపాడానని వివరించారు.

Also Read: Flipkart: ఫ్లిప్ కార్ట్ లో సోనీ టీవీకి ఆర్డరిస్తే.. వచ్చింది మరొకటి!