Home   »  జాతీయం   »   శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ… కేరళ సీఎంకు కిషన్ రెడ్డి లేఖ

శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ… కేరళ సీఎంకు కిషన్ రెడ్డి లేఖ

schedule mahesh

పంబ: ఆదివారం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమల (Sabarimala) అయ్యప్పస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ ఏడాది నవంబర్ 17న మండల-మకరవిళక్కు సీజన్ ప్రారంభం కావడంతో శబరిమల అయ్యప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.

Sabarimala

Sabarimalaలో భక్తుల సమస్యలు పరిష్కారించాలని కేరళ C.M కు కిషన్ రెడ్డి లేఖ

శబరిమల (Sabarimala) ఆలయంలో జరిగిన అవకతవకల వలన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శబరిమల ఆలయానికి వెళ్లే సమయంలో అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని పరిష్కరించాలని, శబరిమల ఆలయంలో భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు తగిన సిబ్బందిని నియమించాలని కోరుతూ కేరళ C.M పినరయి విజయన్ కు లేఖ రాసినట్లు కిషన్ రెడ్డి తన సోషల్ మీడియా హ్యాండిల్ X (ట్విటర్) లో పోస్ట్ చేయడం జరిగింది.

భక్తులకు ఆహారం, నీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు కల్పించాలన్న కిషన్ రెడ్డి

భక్తులకు కనీస వసతులైన ఆహారం, నీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు కల్పించాలని లేఖలో కిషన్ రెడ్డి సీఎం విజయన్‌ను కోరడం జరిగింది. శబరిమల ఆలయం, దానికి అనుబంధంగా అయ్యప్ప భక్తులు చేపట్టిన 40 రోజుల ఆధ్యాత్మిక తీర్థయాత్ర హిందూ విశ్వాసాలలో అత్యంత గౌరవనీయమైన విశ్వాస వ్యవస్థలలో ఒకటని కిషన్ రెడ్డి కేరళ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో తెలిపారు.

ప్రతి ఏడాది సుమారు కోటి మంది భక్తులు శబరిమలను దర్శించుకుంటారన్న కిషన్ రెడ్డి

ప్రతి ఏడాది సుమారు కోటి మంది భక్తులు శబరిమలను దర్శించుకుంటారని మీకు తెలుసు. వారిలో ఎక్కువ మంది నవంబర్ నుంచి జనవరి వరకు మండల సీజన్‌లో అయ్యప్పను దర్శించుకోవడం జరుగుతుంది. శబరిమల దర్శనం కోసం మా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి సుమారు 15 లక్షల మందికి పైగా భక్తులు వస్తుంటారు. అయ్యప్ప స్వామి భక్తుల సన్నిధిలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు పలు వార్తా కథనాల ద్వారా నా దృష్టికి రావడం జరిగింది. ఇటీవల దర్శనం కోసం నిరీక్షిస్తూ యువతి మృతి చెందడం కూడా చాలా బాధాకరమన్నారు. ఈ విషయంలో కేరళ సీఎం వెంటనే స్పందించి భక్తులకు అవసరమైన అన్ని సహాయక చర్యలు అందించాలని కిషన్ రెడ్డి కోరడం జరిగింది.

Also Read: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరంను ప్రారంభించిన మోదీ