Home   »  జాతీయం   »   దావూద్ ఇబ్రహీం ఇంటిని వేలం వేయనున్న ప్రభుత్వం..!

దావూద్ ఇబ్రహీం ఇంటిని వేలం వేయనున్న ప్రభుత్వం..!

schedule mahesh

Dawood Ibrahim: అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) చిన్నతనంలో నివసించిన ఇంటిని వేలం వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆ ఇంటితో పాటు దావూద్ కు చెందిన మరికొన్ని ఆస్తులను కూడా వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

dawood-ibrahim-house-will-be-auctioned-by-the

Dawood Ibrahim ఇంటిని వేలం వేయనున్న ప్రభుత్వం

వివిధ మీడియా కథనాల ప్రకారం ఈ ఆస్తులను శుక్రవారం వేలం వేయడానికి అధికారులు అన్ని ప్రక్రియలను పూర్తి చేశారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా పరిధిలో ఉన్న ముంబాకే గ్రామంలో శుక్రవారం ఈ వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ ఇంటితో పాటు దావూద్ ఇబ్రహీం కుటుంబానికి చెందిన మరికొన్ని ఆస్తులను కూడా ఈ వేలం ప్రక్రియలో అధికారులు వుంచారు.

ఈ నెల 5వ తేదీన ముంబాకేలో వేలం వేయనున్న అధికారులు

అయితే ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ఆ ఇంటిని, ఆస్తులను స్వాధీనం చేసుకోవటం జరిగింది. వీటిని జనవరి 5వ తేదీన ముంబాకేలో వేలం వేయనున్నట్లు తెలుస్తుంది. దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన 4 ప్రాపర్టీలు, వ్యవసాయ భూమి ముంబాకే గ్రామంలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. స్మగ్లర్లు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్ చట్టం 1976 కింద దావూద్‌ ఇబ్రహీం ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకోవటం జరిగింది.

గతంలోనూ దావుద్ ఆస్తులను వేలం వేసిన ప్రభుత్వం

సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం గత 9 సంవత్సరాలలో దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) కుటుంబానికి చెందిన రెస్టారెంట్లు, ఫ్లాట్లు మరియు గెస్ట్ హౌస్‌లతో సహా 11 ఆస్తులను వేలం వేయడం ద్వారా దర్యాప్తు సంస్థలు దాదాపు 12 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. ఇందులో ఒక రెస్టారెంట్ ఖరీదు రూ.4.53 కోట్లు కాగా, 6 ఫ్లాట్ల ధర రూ.3.53 కోట్లు, అతిథి గృహం రూ.3.52 కోట్లకు అమ్మినట్లు తెలుస్తుంది.

దావూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన UNO

1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ముంబాకే గ్రామంలో నివసించేవాడని అధికారులు తెలిపారు. అయితే 1980 ల్లోనే పాకిస్థాన్ పారిపోయిన దావూద్ ఇబ్రహీం, అక్కడి నుండి 1993 ముంబై పేలుళ్లకు ప్రధాన సూత్రధారిగా వున్నాడు. అమెరికాతోపాటు, ఐక్యరాజ్యసమితి కూడా దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం జరిగింది.

2020లో దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు అంగీకరించిన పాక్‌

ఐ.రా.స జాబితాలో అతడి చిరునామా పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దావూద్ ఇబ్రహీం తమ దేశంలో ఆశ్రయం పొందుతున్నాడన్న విషయాన్ని పాక్‌ ఒప్పుకోవడం లేదు. కానీ F.A.T.F గ్రే లిస్టు నుండి బయటపడేందుకు పాక్‌ తప్పని పరిస్థితుల్లో 2020లో ఒకసారి మాత్రం దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు అంగీకరించింది.

అయితే ఇటీవల దావూద్ ఇబ్రహీం చనిపోయాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే దావూద్‌ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందని దాంతో కరాచీలో ఓ ఆస్పత్రిలో చేరాడని కథనాలు వచ్చాయి. ఆ చికిత్స పొందుతూనే దావూద్ ఇబ్రహీం చనిపోయినట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో వార్తలు రావడం జరిగింది. అయితే వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన లు వెలువడలేదు. దీంతో ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం బతికి ఉన్నాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Also Read: రెండో రోజుకు చేరిన లారీ డ్రైవర్ల సమ్మె..!