Home   »  జాతీయం   »   ED విచారణకు హాజరుకాని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌…!

ED విచారణకు హాజరుకాని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌…!

schedule mahesh

ఢిల్లీ: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ రోజు ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా హాజరుకాలేదు. కేజ్రీవాల్‌ మీడియా తో మాట్లాడుతూ ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమని, పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని తెలిపారు.

ఈడీ సమన్లు వెంటనే వెనక్కీ తీసుకోవాలని Delhi CM కేజ్రీవాల్‌ డిమాండ్‌

బీజేపీ ఆదేశాల మేరకే నన్ను ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకోవడానికే నోటీసులు జారీచేశారని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈడీ సమన్లు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేయడం జరిగింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధమున్న మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌కు అక్టోబర్‌ 30న ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

మధ్యప్రదేశ్‌ ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్న కేజ్రీవాల్‌

గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ED ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణకు గైర్హాజరైన (Delhi CM) కేజ్రీవాల్ తను ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్‌ మేరకు మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు ప్రయాణమయ్యారు. పంజాబ్‌ C.Mభగవంత్‌ సింగ్‌ మాన్‌తో కలిసి మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి రోడ్డుషోలో పాల్గొనబోతున్నారు.

ఈ మద్యం పాలసీ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఈ ఏడాది ఏప్రిల్‌లో కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. అయితే గతేడాది ఆగస్టు 17న సీబీఐ దాఖలు చేసిన ప్రథమ సమాచార నివేదిక ఎఫ్‌ఐఆర్‌ లో కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదు.

ఫిబ్రవరి 2023లో ఇప్పుడు రద్దు చేయబడిన ఢిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో మరియు అమలు చేయడంలో అక్రమాలకు పాల్పడినందుకు డిప్యూటీ మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం సిసోడియా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియా బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అక్రమాలకు సంబంధించిన కేసులకు సంబంధించి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను అక్టోబర్ 30న సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసు విచారణను ఆరు నుంచి ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది.

బెయిల్‌ను తిరస్కరించిన కోర్టు 338 కోట్ల నగదు బదిలీకి సంబంధించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో విచారణ నెమ్మదిగా సాగితే మూడు నెలల తర్వాత సిసోడియా మళ్లీ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది.