Home   »  జాతీయం   »   ED విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన ఢిల్లీ CM..!

ED విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన ఢిల్లీ CM..!

schedule mahesh

Delhi CM | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ED విచారణకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి హాజరుకాలేదు. కోర్టు నిర్ణయం తర్వాతే కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.

delhi-cm-once-again-absent-from-ed-investigation

Delhi CM | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ED విచారణకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి హాజరుకాలేదు. విచారణకు హాజరు కావాలంటూ ED ఆరోసారి సమన్లు జారీ చేసినప్పటికీ కేజ్రీవాల్ మాత్రం విచారణకు హాజరుకాలేదు. ఫిబ్రవరి 19 సోమవారం తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈ నెల 14న కేజ్రీవాల్ కు ED సమన్లు జారీ చేసింది.

కోర్టు తీర్పు వెలువడే వరకు ED సంయమనం పాటించాలన్న ఆప్

ఈ సందర్భంగా ఆప్ స్పందిస్తూ.. కేజ్రీవాల్‌కు ED పంపిన సమన్లు చట్టవిరుద్ధమని పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు నిర్ణయం వెలువడే వరకు ED పదే పదే సమన్లు పంపవద్దని, కోర్టు నిర్ణయం వెలువడే వరకు ED సంయమనం పాటించాలని కోరింది. కోర్టు నిర్ణయం తర్వాతే కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.

ఈ నెల 17న రూస్ అవెన్యూ కోర్టు విచారణకు హాజరైన కేజ్రీవాల్

ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు విచారణకు కేజ్రీవాల్ హాజరుకావడం జరిగింది. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా మార్చి 16న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని కేజ్రీవాల్ ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేయడం జరిగింది.

Also Read | వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కానున్న కేజ్రీవాల్