Home   »  జాతీయం   »   Delhi Metro | ఢిల్లీ మెట్రోలో ఘర్షణ.. వీడియో వైరల్‌

Delhi Metro | ఢిల్లీ మెట్రోలో ఘర్షణ.. వీడియో వైరల్‌

schedule sirisha

న్యూ ఢిల్లీ: ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్తున్నప్పుడు అప్పుడ‌ప్పుడూ కొన్ని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతు ఉంటాయి. చిన్నచిన్న కార‌ణాల‌కే కొంద‌రు గొడ‌వ‌ప‌డుతుంటారు. ముఖ్యంగా ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటాయి.

Delhi Metro | ఢిల్లీ మెట్రోలో ప్రయాణీకుల మధ్య గొడవ

ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణీకుల చేష్టలు, అసభ్యకర ప్రవర్తనలు, డ్యాన్స్‌, రీల్స్‌ వంటి వింత పోకడలకు సంబంధించిన వీడియోలు త‌ర‌చూ సోష‌ల్ మీడియాలో వస్తుంటాయి. తాజాగా మరో వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఓ పెద్దాయన పై తోటి ప్రయాణికుడు దురుసగా ప్రవర్తించాడు.

రైలు కోచ్‌లో నిలబడ్డ ఓ వృద్ధ ప్రయాణికుడిపై తోటి వ్యక్తి గొడవ పడ్డాడు . అనంతరం ఆ పెద్దాయనపై చేయిచేసుకున్నాడు. దీంతో తోటి ప్రయాణికులు జోక్యం చేసుకొని పెద్దాయనకు సాయం చేశారు. దాడి చేసిన వ్యక్తిని దూరంగా నెట్టారు. అంతా కలిసి అతడిని పట్టుకొని కొట్టారు.

అయితే అక్కడ గొడవ ఎందుకు చోటు చేసుకుందో మాత్రం ఎవరికీ తెలిదు. ఈ గొడవకు సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి, చక్కర్లు కొడుతుంది.