Home   »  జాతీయం   »    ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా 2 రోజులు స్కూళ్లు బంద్‌…

 ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా 2 రోజులు స్కూళ్లు బంద్‌…

schedule sirisha

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వాయుకాలుష్యం చుట్టుముట్టింది. ఒక్కోసారి గాలి నాణ్యత క్షీణించి, కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల తర్వాత కూడా నగరమంతా పొగతో నిండిపోయింది.

ఢిల్లీ కాలుష్యం (Delhi Pollution) వల్ల స్కూళ్లకు బంద్‌ ప్రకటించిన కేజ్రీవాల్

దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తరగతులు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని స్పష్టం చేశారు.

డీజిల్ వాహనాల రాకపోకలపై కూడా ఆంక్షలు

అయినప్పటికీ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో అనవసరమైన నిర్మాణ పనులపై నిషేధం ఆంక్షలు జారీ చేసారు. అదేవిధంగా వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు డీజిల్ వాహనాల రాకపోకలపై కూడా ఆంక్షలు విధించారు.