Home   »  జాతీయం   »   పెద్దనోట్ల రద్దు ఉపాధిని నాశనం చేసేందుకు పన్నిన కుట్ర : రాహుల్ గాంధీ

పెద్దనోట్ల రద్దు ఉపాధిని నాశనం చేసేందుకు పన్నిన కుట్ర : రాహుల్ గాంధీ

schedule mahesh

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (Demonetisation) అనేది ఉపాధిని నాశనం చేసేందుకు, అసంఘటిత ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు ఇది బాగా ఆలోచించి పన్నిన కుట్ర అని, నోట్ల రద్దు ఏడో వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం విరుచుకుపడ్డారు.

Demonetisation కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచించి పన్నిన కుట్ర:రాహుల్

నోట్ల రద్దు అనేది ఉపాధిని నాశనం చేయడానికి, కార్మికుల ఆదాయాన్ని ఆపడానికి, చిన్న వ్యాపారాలను తొలగించడానికి, రైతులకు హాని కలిగించడానికి, అసంఘటిత ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచించిన పన్నిన కుట్ర అని రాహుల్ గాంధీ ఎక్స్‌(X) లో తెలిపారు.

2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని

99 శాతం మంది సామాన్య భారతీయులపై దాడి చేసి ఒక శాతం పెట్టుబడిదారీ మోదీ స్నేహితులకు లబ్ధి చేకూర్చింది. నల్లధనం, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్లను రద్దు పరిచే నిర్ణయాన్ని ప్రధాని 2016 నవంబర్ 8న దేశ ప్రజలనుద్దేశించి టెలివిజన్ ప్రసంగంలో ప్రకటించారు.