Home   »  జాతీయం   »   Emergency Alert: మీ ఫోన్‌కి కూడా ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా.?

Emergency Alert: మీ ఫోన్‌కి కూడా ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా.?

schedule ranjith

ఎమర్జెన్సీ అలర్ట్‌ (Emergency Alert) మెసేజ్‌ గురించి టెన్షన్‌ పడొద్దని కేంద్రం ప్రకటించింది. ప్రతి ఒక్కరికి తమ మొబైల్ కి ఇలాంటి మెసేజ్ రావడం చూసే ఉంటారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా, దేశంలో ఏదైనా అత్యవసర పరిస్థితుల సందర్భంలో పంపించే మెసేజ్ సిస్టమ్ ను కేంద్ర టెలీ కమ్యునికేషన్ వారు శాంపిల్ గా పంపించారు.

Emergency Alert: ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిందా.?

మీ మొబైల్‌‌కు అలర్ట్ మెసేజ్ వచ్చిందా? కాసేపటికి శబ్ధం వస్తుందా? కంగారు పడుతున్నారా? అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరి మొబైల్ స్క్రీన్లపై ఈ రకమైన మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అయితే ఎవరూ ఆందోళన చెందక్కర్లేదు. ఎమర్జెన్సీ అలర్ట్‌ మెసేజ్‌ గురించి టెన్షన్‌ పడొద్దని కేంద్రం ప్రకటించింది. భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదల్లాంటి సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఇలాంటి అలర్ట్‌ మెసేజ్‌ పంపనున్నారు. దీనిని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రూపొందించగా.. ఈరోజు పరీక్షించారు. పెద్ద సౌండ్‌తో కూడిన మెసేజ్‌ అందరికీ రావడంతో.. మొబైల్ యూజర్లు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటివరకు తెలుగు, హింది, ఇంగ్లీష్‌ భాషల్లో మెసేజ్‌ వచ్చింది.

Also Read: Salaar Movie Release: సాలార్ విడుదల తేదీ ఖరారు… ఎప్పుడంటే.?