Home   »  జాతీయం   »   సంచలన వ్యాఖ్యలు చేసిన ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్

సంచలన వ్యాఖ్యలు చేసిన ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్

schedule mahesh

బెంగళూరు: కర్ణాటకలో ఇటీవల BJP-JDSపార్టీల మధ్య కుదిరిన పొత్తును వ్యతిరేకిస్తున్న 40 మందికి పైగా బీజేపీ, జేడీ(ఎస్) నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) గురువారం ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో శిరహట్టి సెగ్మెంట్ నుంచి పోటీ చేసేందుకు కాషాయ పార్టీ టికెట్ నిరాకరించిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే రామప్ప లమాని పాత పార్టీలో చేరిన అనంతరం శివకుమార్ విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి షరతులు లేకుండానే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు.

BJP-JDS పార్టీల మధ్య కుదిరిన పొత్తు

దేవెగౌడ నేతృత్వంలోని జెడి (ఎస్) పార్టీ గత నెలలో బిజెపితో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకుంది. దాని నాయకుడు హెచ్‌డి కుమారస్వామి హోం మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. BJP తో పొత్తు పెట్టుకున్నారు.

40 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్న DK Shivakumar

అయితే ఆ పార్టీల్లో పొత్తు నచ్చని 40 మందికిపైగా నేతల నుంచి దరఖాస్తులు నాకు అందాయని వాళ్ళు పార్టీ మారడానికి సిద్ధంగా వున్నారని DK శివకుమార్ అన్నారు. అయితే స్థానిక నేతలతో చర్చించిన తర్వాత ఒక్కొక్కరిగా వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాం అన్నారు.

ఈ బిజెపి, జెడి (ఎస్) నాయకులు రాష్ట్రంలోని ఉత్తరాన బీదర్ నుండి దక్షిణాన చామరాజనగర్ వరకు ఉన్నారు. బిజెపి, జెడి-ఎస్ మధ్య కూటమిని వ్యతిరేకిస్తూ చాలా మంది నాయకులు మా పార్టీలో చేరడానికి ఆసక్తి కనబరిచారు. ఈ నాయకులను చేర్చుకుంటే అది మా నాయకత్వానికి, దేశానికి ప్రయోజనకరంగా ఉంటుందని శివకుమార్ తెలిపారు.