Home   »  జాతీయం   »   ఆరేళ్లలో 44 లక్షల మంది కుక్కకాటుకు గురి.

ఆరేళ్లలో 44 లక్షల మంది కుక్కకాటుకు గురి.

schedule sirisha

Dogs Attack | యునైటెడ్ స్టేట్స్‌లో జాతీయ కుక్క కాటు నివారణ వారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 9 నుండి 15 వరకు కుక్క కాటు నివారణ సమాచారాన్ని అందరికీ వివరించి సదస్సులు నిర్వహిస్తారు. నేషనల్ డాగ్ బైట్ ప్రివెన్షన్ వీక్ అనేది నేషనల్ డాగ్ బైట్ ప్రివెన్షన్ వీక్ కూటమి యొక్క ప్రాజెక్ట్ అని అధికారిక శాఖ తెలిపింది.

Dogs Attack

Dogs Attack | తమిళనాడులో 44 లక్షల మంది కుక్కకాటుకు గురి

తమిళనాడు రాష్ట్రంలో ఆరేళ్లలో పిచ్చికుక్క కాటుకు 44 లక్షల మంది ప్రజలు గురైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. రేబిస్‌ వ్యాధి టీకాల ద్వారా నిరోధించగలిగే జినోటిక్‌ వైరస్‌, ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని, ప్రపంచస్థాయిలో 150 దేశాల్లో 59వేల మంది మరణించారని వెల్లడించారు. అందులో మూడు వంతుల్లో ఒక భాగం భారతదేశంలో నమోదయ్యాయని అన్నారు. 2030 నాటికి రేబిస్‌ రహిత తమిళనాడుగా మార్చేందుకు చర్యలు చేడతామని అధికారులు చెప్పుకొచ్చారు.

USలో ప్రతి సంవత్సరం 4.5 మిలియన్ల మంది …..

US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ప్రకారం, యునైటెడ్ స్టేట్స్‌లో ప్రతి సంవత్సరం 4.5 మిలియన్ల మందికి పైగా ప్రజలు కుక్కకాటుకు గురవుతున్నారు. 8 లక్షల కంటే ఎక్కువ మంది కుక్క కాటుకు వైద్య సంరక్షణ పొందుతున్నారు. కాటుకు గురైన వారిలో కనీసం సగం మంది చిన్నారులే ఉంటున్నారు.

మనదేశంలో జాతీయ కుక్క కాటు నివారణ వారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ రెండవ పూర్తి వారంలో జరుపుతున్నారు. కుక్క కాటును నివారించడం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంపై ఆరోగ్య శాఖ దృష్టి సారిస్తుంది. ఏప్రిల్ 9 నుండి 15 వరకు కుక్క కాటు నివారణ సమాచారాన్ని షేర్ చేయడానికి PreventDogBites హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించాలి.

Also read: 3 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి… నిన్న విశ్వ నేడు సోమశ్రీ..