Home   »  జాతీయం   »   మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్‌లలో భూకంపం..!

మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్‌లలో భూకంపం..!

schedule raju
Earthquake in Maharashtra and Arunachal Pradesh

Earthquake | మహారాష్ట్ర మరియు అరుణాచల్‌ ప్రదేశ్‌లలో ఈరోజు (గురువారం) ఉదయం భూకంపం సంభవించింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నాందేడ్‌తో పాటు పర్భానీ, హింగోలిలో కూడా భూప్రకంపనలు సంభవించాయి.

మహారాష్ట్రలోని నాందేడ్‌లో గురువారం ఉదయం 6:08 గంటలకు భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు అని తెలిపారు.

మహారాష్ట్ర కంటే ముందుగా అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం తెల్లవారుజామున రెండు భూకంపాలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. మొదటి భూకంపం గురువారం తెల్లవారుజామున 1:49 గంటలకు సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.7గా నమోదైంది. రెండో భూకంపం ఉదయం 3.40 గంటలకు అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్‌లో సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదైంది. ఈ రెండు భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

Also Read: పాకిస్థాన్‌లో 4.7 తీవ్రతతో భూకంపం..