Home   »  జాతీయం   »   అత్యవసర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం: EC

అత్యవసర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం: EC

schedule raju
Provision of postal ballot to employees of emergency government departments

ఆంధ్రప్రదేశ్: పార్లమెంటు, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. మే 13న పోలింగ్‌ జరగనుంది. అయితే, పోలింగ్ రోజు విధులు నిర్వహించే RTC ఉద్యోగులతో సహా 33 అత్యవసర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ (postal ballot) సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

అత్యవసర సేవల్లో ఉండే రైల్వే, విద్యుత్, ఫైర్, అంబులెన్స్, హెల్త్, పోలీస్, ఫుడ్ కార్పొరేషన్‌తో పాటు తదితర డిపార్ట్‌మెంట్లలో పనిచేసే ఉద్యోగులు, EC అనుమతి పొందిన మీడియా సంస్థల్లో పనిచేసేవారు ఈ లిస్టులో ఉన్నారు. అయితే, పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకోవాలంటే ఎన్నికల సంఘం జారీ చేసిన ఆథరైజేషన్‌ లెటర్‌ తప్పనిసరి. పోలింగ్‌ రోజు ఓటు వేయలేని వారి కోసం ఫారం–12Dలను కూడా అందుబాటులో ఉంచారు. అంతే కాకుండా పోస్టల్‌ బ్యాలెట్ల కోసం జిల్లాలో ప్రత్యేకించి ఒక నోడల్‌ అధికారిని నియమించారు.

34 అత్యవసర ప్రభుత్వశాఖల వివరాలు | postal ballot

  1. మెట్రో
  2. రైల్వే రవాణా (ప్రయాణికులు, సరుకు రవాణా) సేవలు
  3. మీడియా
  4. విద్యుత్‌
  5. BSNL
  6. పోస్టల్‌ టెలిగ్రామ్‌
  7. దూరదర్శన్‌
  8. ఆకాశవాణి
  9. రాష్ట్ర మిల్క్‌ యూనియన్‌
  10. మిల్క్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలు
  11. ఆరోగ్యశాఖ
  12. ఫుడ్‌ కార్పొరేషన్‌
  13. విమానయానం
  14. RTC
  15. అగ్నిమాపక సేవలు
  16. ట్రాఫిక్‌ పోలీసు
  17. అంబులెన్స్‌ సేవలు
  18. షిప్పింగ్‌
  19. ఫైర్‌ ఫోర్స్‌
  20. జైళ్లు
  21. ఎక్సైజ్ శాఖ
  22. వాటర్‌ అథారిటీ
  23. ట్రెజరీ సర్వీసు
  24. అటవీశాఖ
  25. సమాచార ప్రజా సంబంధాల శాఖ
  26. పోలీసులు
  27. పౌర రక్షణ–హోం గార్డులు
  28. ఆహార పౌరసరఫరాలు–వినియోగదారుల వ్యవహారాలు
  29. ఎనర్జీ
  30. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా
  31. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో
  32. డిపార్టుమెంట్‌ ఆఫ్‌ PWD
  33. నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్లు
  34. విపత్తు నిర్వహణ.

Also Read: 11 రాష్ట్రాల్లో రూ.3,400 కోట్లు సీజ్ చేసిన EC