Home   »  జాతీయం   »   11 రాష్ట్రాల్లో రూ.3,400 కోట్లు సీజ్ చేసిన EC

11 రాష్ట్రాల్లో రూ.3,400 కోట్లు సీజ్ చేసిన EC

schedule ranjith
EC seized Rs.3,400 crore in 11 states

కేంద్ర ఎన్నికల సంఘం (EC) మార్చి 16న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో గతంలో సీజ్ చేసిన అక్రమ డబ్బు గురించి వివరాలను విడుదల చేసింది. 2022-23లో 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ₹3,400 కోట్ల అక్రమ డబ్బును సీజ్ చేసినట్లు EC వెల్లడించింది. 2017-18 ఎన్నికలతో పోలిస్తే ఈ డబ్బు విలువ 835% పెరిగినట్లు పేర్కొంది. ఈ డబ్బులో గుజరాత్‌-₹802 కోట్లు, తెలంగాణ-₹778 కోట్లు, రాజస్థాన్‌-₹704 కోట్లు, కర్ణాటక-₹384 కోట్లు, మధ్యప్రదేశ్‌-₹332 కోట్లు, మిజోరాం-₹123 కోట్లు, ఛత్తీస్‌గఢ్-₹78 కోట్లు, మేఘాలయ-₹74 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-₹57 కోట్లు, నాగాలాండ్-₹50 కోట్లు, త్రిపుర-₹45 కోట్ల డబ్బును సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Also Read | కవిత అరెస్ట్‌పై స్పందించిన CM రేవంత్ రెడ్డి.