Home   »  జాతీయం   »   కేజ్రీవాల్‌కు 7వ సారి సమన్లు జారీ చేసిన ED..!

కేజ్రీవాల్‌కు 7వ సారి సమన్లు జారీ చేసిన ED..!

schedule mahesh

Arvind Kejriwal | ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా సమన్లు ​​జారీ చేసినట్లు అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి.

ed-has-issued-summons-to-arvind-kejriwal-7-times

Arvind Kejriwal | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi liquor policy case) ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఈ కేసులో ED కేజ్రీవాల్‌కు ఇప్పటి వరకు 7సార్లు సమన్లు జారీ చేసింది. కానీ కేజ్రీవాల్‌ ఒక్కసారి కూడా ED విచారణకు హాజరు కాలేదు. దీంతో ED మరోసారి సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 26న ఏజెన్సీ కార్యాలయంలో జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ED తన నోటీసుల్లో పేర్కొంది.

గ‌తంలో నవంబర్ 2, డిసెంబర్ 21, ఆపై జనవరి 3న కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చిన ED అధికారులు, ఆ తర్వాత జనవరి 13న నాలుగోసారి కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే కేజ్రీవాల్ నాలుగుసార్లు ED నోటీసులను తోసిపుచ్చారు. దీంతో ED జనవరి 31, ఫిబ్రవరి 14న నోటీసులు జారీ చేసింది.

గతంలో ED నోటీసులను చట్టవిరుద్ధమని కొట్టిపారేసిన Arvind Kejriwal

అయితే అప్పుడు కూడా ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో పాటు ED నోటీసులను చట్టవిరుద్ధమని కొట్టిపారేశారు. తనను అరెస్టు చేసేందుకు కుట్రలో భాగంగానే ED నోటీసులు పంపుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు తాజాగా ఏడోసారి ED సమన్లు జారీచేసింది.

Also Read | వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కానున్న కేజ్రీవాల్