Home   »  జాతీయం   »   సీఎం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన ఈడీ..!

సీఎం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన ఈడీ..!

schedule mahesh

న్యూఢిల్లీ: మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను (CM Kejriwal) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నవంబర్ 2న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీచేసింది.

ED ముందు హాజరు కావాలని CM Kejriwal కు ఆదేశాలు జారీ

నవంబర్ 2న ED ముందు హాజరు కావాలని కేజ్రీవాల్‌కు ఆదేశాలు జారీ చేయటం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేజ్రీవాల్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ప్రశ్నించింది.

సిసోడియా విచారణను 8నెలల్లోగా పూర్తి చేయాలన్న ధర్మాసనం

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన రోజునే సమన్లు జారీ చేయటం గమనార్హం. జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్‌లతో కూడిన ధర్మాసనం సిసోడియా విచారణను ఆరు నుంచి ఎనిమిది నెలల్లోగా పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

విచారణ నెమ్మదిగా సాగితే సిసోడియా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం తెలిపింది. జస్టిస్ ఖన్నా తీర్పును వెలువరిస్తూ అనేక ప్రశ్నలకు సమాధానాలు లేనప్పటికీ, 338 కోట్ల రూపాయల బదిలీకి సంబంధించి ఒక అంశం తాత్కాలికంగా నిర్ధారించబడిందని తెలిపారు.

గతేడాది ఆగస్టులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేయటం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఈ నెల ప్రారంభంలో ఈడీ అరెస్ట్ చేయటం జరిగింది.