Home   »  జాతీయం   »   Election Commission |నేడు తెలంగాణ పర్యటనకు రానున్న ఎన్నికల సంఘం

Election Commission |నేడు తెలంగాణ పర్యటనకు రానున్న ఎన్నికల సంఘం

schedule mahesh

హైదరాబాద్: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సంసిద్ధతను అంచనా వేసేందుకు భారత ఎన్నికల సంఘం (Election Commission) చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి బృందం ఈ రోజు నుండి తెలంగాణలో పర్యటించనుంది.

భారత ఎన్నికల సంఘం మూడు రోజుల పర్యటనలో భాగంగా పలు రాజకీయ పార్టీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, ఇతర వాటాదారులతో సమావేశం కానున్నారు.

తొలిరోజు రాజకీయ పార్టీలతో సమావేశం కానున్న Election Commission

ఎన్నికల సంఘం తమ పర్యటనలో భాగంగా తొలిరోజు జాతీయస్థాయి, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం జరిగే ఈ సమావేశానికి ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ముగ్గురు ప్రతినిధులను ఆహ్వానించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీల అభిప్రాయాలు, సూచనలను ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది.

ఈ సమావేశం తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమావేశం కానున్న ఎన్నికల సంఘం రానున్న ఎన్నికలకు సంబంధించిన కీలక అంశాల పై చర్చించనున్నారు. ఓటర్లకు డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాల గురి కాకుండా చూసేందుకు ఈ సమావేశంలో చర్యలు తీసుకోనున్నారు.

తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్, రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాల నోడల్ అధికారులు ఎన్నికల సంసిద్ధత గురించి ఎన్నికల కమిషన్ బృందం చర్చించనున్నారు.

రెండో రోజు కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో సమావేశం కానున్న EC

మరుసటి రోజు అంటే రేపు ఓటరు అవగాహన ప్రచారంలో భాగంగా సైక్లోథాన్, వాకథాన్‌లను బృందం ఫ్లాగ్ ఆఫ్ చేస్తుంది. అనంతరం జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించి జిల్లా స్థాయి సన్నద్ధత పై సమీక్షిస్తారు.

మూడో రోజు CS శాంతి కుమారి, DGPలతో అంజనీ కుమార్‌లతో సమావేశం కానున్న EC

అక్టోబర్ 5న, ఎన్నికల బృందం సిస్టమాటిక్ ఓటర్ల ఎడ్యుకేషన్, ఎలక్టోరల్ పార్టిసిపేషన్,
కార్యకలాపాల పై ప్రదర్శనను సందర్శిస్తుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో అవగాహన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఎన్నికల బృందం రాష్ట్ర చిహ్నాలు, వికలాంగులుఓటర్లు , యువ ఓటర్లతో సంబాషించనుంది.

ఎన్నికల సన్నద్ధతపై చర్చించేందుకు ఈ బృందం తదనంతరం చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్‌లతో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది.