Home   »  జాతీయం   »   భారతీయ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు..!

భారతీయ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు..!

schedule mahesh

Emmanuel Macron | ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శుక్రవారం భారతీయ విద్యార్థులకు ఓ శుభవార్త తెలిపారు.

emmanuel-macron-gave-good-news-to-indian-student

Emmanuel Macron | ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శుక్రవారం కీలక ప్రకటన చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మరింత మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లో చదువుకునేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 2030 నాటికి దాదాపు 30 వేల మంది విద్యార్థులను ఫ్రాన్స్ కు ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. తద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆయన తెలిపారు.

30వేల మంది విద్యార్థులను ఫ్రాన్స్ కు ఆహ్వానిస్తామన్న మాక్రాన్

దీనికి సంబంధించి ట్విట్టర్ X లో పోస్ట్ చేయడం జరిగింది. తన పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని మాక్రాన్ ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. “అందరికీ ఫ్రెంచ్, మంచి భవిష్యత్తు కోసం ఫ్రెంచ్” అనే చొరవ కింద విశ్వవిద్యాలయాలలో ఫ్రెంచ్ అభ్యాస నెట్‌వర్క్‌ను రూపొందించనున్నట్లు ఆయన వివరించారు.

ఫ్రెంచ్ మాట్లాడలేని విద్యార్థులకు అంతర్జాతీయ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ఫ్రాన్స్ లో చదివిన పూర్వ విద్యార్థులకు వీసా సౌకర్యాలు కల్పిస్తామని మాక్రాన్ ఈ సందర్భంగా ప్రకటించారు. 2025 నాటికి 20 వేల మంది విద్యార్థులను ఫ్రాన్స్‌కు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

Also Read | రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ఢిల్లీ మహిళా పోలీసు దళం..!