Home   »  జాతీయం   »   Income Tax Budget 2024 | కోటి మంది టాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్ చేపిన ఆర్థిక మంత్రి.!

Income Tax Budget 2024 | కోటి మంది టాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్ చేపిన ఆర్థిక మంత్రి.!

schedule raju

Income Tax Budget 2024 | బడ్జెట్ 2024: 2010-11 నుండి 2014-15 వరకు ఉన్న ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ₹10,000 వరకు పన్ను డిమాండ్‌లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Finance Minister gave good news to tax payers

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను చెలింపుదారులకు శుభవార్త చెప్పారు. ఫిబ్రవరి 1, గురువారం నాడు, 2009-10 ఆర్థిక సంవత్సరానికి ₹25,000 వరకు ఉన్న అన్ని ప్రత్యక్ష పన్ను డిమాండ్‌లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇంకా, 2010-11 నుండి 2014-15 వరకు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ₹10,000 మించని డిమాండ్‌లు ఉపసంహరణకు నిర్ణయించబడ్డాయి.

కోటి మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం | Income Tax Budget 2024

ఈ ప్రకటన 1 కోటి మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. ఈ బకాయిలతో సతమతమవుతున్న వ్యక్తులపై భారాన్ని తగ్గించడం లక్ష్యంగా నిర్దేశిత సంవత్సరాల్లో బాకీ ఉన్న పన్ను డిమాండ్ల ఉపసంహరణ చేసారు.

NA Shah Associates LLP మేనేజింగ్ పార్టనర్ సందీప్ షా, అభివృద్ధిపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ “ప్రభుత్వం 10 మిలియన్ల పన్ను చెల్లింపుదారులకు చిరునవ్వులను తీసుకువచ్చింది. ఇది పన్ను చెల్లింపుదారులకు సానుకూల ఫలితాన్ని సూచించడమే కాకుండా ప్రభుత్వం తన డేటాబేస్ యొక్క నిశిత వినియోగాన్ని ప్రతిబింబిస్తుంది” అని తెలిపారు.

Also Read: నేడు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌