Home   »  జాతీయం   »   బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి స్వర్ణం…

బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి స్వర్ణం…

schedule mahesh

ASIAN GAMES : సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి శనివారం చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి స్వర్ణ (First Gold) పతకాన్ని అందించారు.

బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన సాయిరాజ్, చిరాగ్ శెట్టి (First Gold)

భారత బ్యాడ్మింటన్‌కు కొత్త శకానికి నాంది పలికిన సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా జంట చోయి సోల్గ్యు, కిమ్ వోన్హోలను వరుస గేముల్లో 21-18, 21-16 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ పురుషుల డబుల్స్ జోడీగా కూడా నిలిచింది.

స్వర్ణం తో మెరిసిన భారత పురుషుల కబడ్డీ జట్టు

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో గోల్డ్‌ మెడల్‌ సొంతం అయ్యింది. ఆఖరి నిమిషంలో వివాదాస్పదమైన భారత్‌, ఇరాన్‌ పురుషుల కబడ్డీ ఫైనల్‌లో ఎట్టకేలకు భారత్‌ విజయం సాధించింది. చివరి నిమిషంలో ఓ రైడ్‌కు సంబంధించి అంపైర్‌ ఇచ్చిన నిర్ణయం వివాదాస్పదంగా మారడంతో ఇరు జట్లు అంపైర్‌ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేసాయి. ఈ క్రమంలో దాదాపు గంటపాటు ఆట ఆగిపోయింది.

జ్యూరీ జోక్యంతో గంట విరామం తర్వాత ఆట తిరిగి ప్రారంభమైంది. ఒక సక్సెస్‌ఫుల్‌ రైడ్‌, సూపర్‌ టాకిల్‌తో భారత్‌ నాలుగు పాయింట్లు సాధించి 33-29 తేడాతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.