Home   »  జాతీయం   »   కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ సీఎం..!

కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ సీఎం..!

schedule mahesh

Congress Party | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సీనియర్ నాయకుడు త్వరలో BJPలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

former-cm-said-goodbye-to-congress-party

Congress Party | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సీనియర్ నాయకుడు త్వరలో BJPలో చేరనున్నట్లు తెలుస్తుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు.

BJPలో చేరనున్న Ashok Chauhan

ఇటీవల మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా పార్టీని వీడటం జరిగింది. ఆయన శివసేన పార్టీలో చేరారు. MLA అశోక్ చౌహాన్ తన రాజీనామా లేఖను మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు అందించినట్లు తెలుస్తుంది. ఢిల్లీలో జరగనున్న ఓ కార్యక్రమంలో ఆయన BJP లో చేరే అవకాశాలు కనిపిస్తోన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ పనితీరుపై అశోక్ చౌహాన్ అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.

Also Read | ఖతర్‌ నుంచి భారత్‌ చేరుకున్న 8 మంది భారత నేవీ మాజీ అధికారులు..!