Home   »  జాతీయం   »   G20 Summit |G20 సదస్సు నిర్వహణ ఖర్చు 4,050 కోట్లు

G20 Summit |G20 సదస్సు నిర్వహణ ఖర్చు 4,050 కోట్లు

schedule mahesh

న్యూఢిల్లీ : భారత్‌లోని ఢిల్లీలో జరగనున్నG20 Summit సదస్సును కేంద్రం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. G20 సదస్సు నిర్వహణ ఖర్చు 4,050 కోట్లు

ఈ సదస్సు జరిగే భారత్‌ మండపంతో పాటు ఢిల్లీ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది. కాగా G20 Summit కోసం కేంద్ర ప్రభుత్వం 4050 కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర వర్గాల ద్వారా తెలుస్తుంది.

ఇందులో 3600 కోట్లు భారత్‌ మండపం, ఇతర శాశ్వత ఆధునికీకరణ పనుల కోసం వెచ్చించినట్లు పేర్కొంది.

మరో 340 కోట్లు ఢిల్లీ నగర పోలీసుల విధి నిర్వహణ కోసం ఖర్చు చేస్తుందని సమాచారం ఇప్పటికే G20 సదస్సు జరిగే రెండు రోజులు కేంద్రం

కేంద్ర బలగాలు, ఢిల్లీ పోలీసులతో ఢిల్లీ మొత్తం జల్లెడ పట్టిస్తూ పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేసింది.

దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు ప్రత్యేక వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నారు.

అయితే జీ 20 సదస్సు సందర్భంగా ఏర్పాటు చేయనున్న విందులో ప్రముఖ వ్యాపార వేత్తలు ముఖేశ్ అంబానీ, గౌతం అదానీ సహా 500 మంది హాజరు కానున్నారు.

మరోవైపు జీ 20 డిన్నర్ కోసం ప్రత్యేకంగా వంటకాలను తయారు చేయిస్తున్నారు. ప్రత్యేక వంటకాలు అతిథులకు రుచి చూపించనున్నారు.

భారత్ ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించిన వారు ఎప్పటికీ మరచిపోలేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

డిన్నర్ సెట్‌లో వెండి వస్తువులు, బంగారు పూత పూసిన గిన్నెలు ఉన్నాయి. సాల్ట్ స్టాండ్, స్పూన్, గిన్నె, గ్లాస్, ప్లేట్‌లకు రాయల్‌గా తయారు చేశారు.

ఆహారాన్ని వడ్డించే విధానంలో భారత సంస్కృతి, వారసత్వం, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా ఏర్పాట్లు చేసింది. 

G20 సదస్సుకు విచ్చేయనున్న బ్రిటన్‌ ప్రధాని, భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ షాంగ్రిలా హోటల్‌లో ఉండనున్నారు.

ది లలిత్‌ హోటల్‌లో కెనడా, జపాన్‌ ప్రధానులు జస్టిన్ ట్రూడో , కిషిడా బస చేయనున్నారు.

ఇంపీరియల్‌ హోటల్లో లో ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌ అంథోని, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మ్యూనల్ మేక్రాన్‌ క్లారిడ్టెస్‌ హోటల్లో బస చేయనున్నారు.

చైనా అధ్యక్షుడి జి జిన్ పింగ్ కోసం వసతి ఏర్పాటు చేయగా ఆయన ఈ సదస్సు రావడం లేదని ఆదేశ ప్రతినిధుల కోసం బృదం కోసం మారియట్‌ అండ్‌ హయత్‌ రీజెన్సీ హోటల్‌ను కేటాయించారు.