Home   »  జాతీయంవినోదం   »   గాంధీ చిత్రం ప్రదర్శన.. 10 రోజులు ఉచితంగా

గాంధీ చిత్రం ప్రదర్శన.. 10 రోజులు ఉచితంగా

schedule raju

తెలంగాణ: స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ చిత్రం ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు ఐ అండ్‌ పీఆర్‌ ప్రత్యేక కమిషనర్‌ అశోక్‌రెడ్డి వెల్లడించారు. ‘ఈ నెల 14 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో 582 స్క్రీన్లలో ప్రదర్శన ఉంటుంది. ఈ నెల 14 న ఉదయం 8 నుంచి 11.30 వరకు, 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉదయం 10గంటల నుంచి మ.1.30 వరకు ప్రదర్శన ఉంటుంది’ అని ఆయన తెలిపారు.

విద్యార్థులను థియేటర్ల వద్దకు ఉచితంగా తీసుకొచ్చి, క్షేమంగా వారి గమ్యస్థానాలకు తీసుకెళ్లే విధంగా థియేటర్ల నిర్వాహకులు, విద్యాశాఖ, రవాణా శాఖ తదితర శాఖలకు చెందిన అధికారులతో సమన్వయం చేసుకొంటూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.