Home   »  జాతీయం   »   గాంధీజీ “మహపురుషుడు”, మోదీ “యుగపురుషుడు”: జగదీప్ ధన్‌ఖర్

గాంధీజీ “మహపురుషుడు”, మోదీ “యుగపురుషుడు”: జగదీప్ ధన్‌ఖర్

schedule mahesh

ముంబై: మహాత్మాగాంధీ గత శతాబ్దపు “మహా పురుషుడు”, ప్రధాని మోదీ ప్రస్తుత శతాబ్దపు “యుగపురుషుడు” అంటూ ప్రధాని నరేంద్ర మోదీని మహాత్మాగాంధీతో పోల్చిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ (jagdeep dhankhar).

jagdeep dhankhar

ఈ శతాబ్దపు “యుగపురుషుడు” నరేంద్ర మోదీ : jagdeep dhankhar

ముంబైలో జరిగిన శ్రీమద్ రాజచంద్ర జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ మహాత్మాగాంధీ గత శతాబ్దపు గొప్ప వ్యక్తి అయితే ఈ శతాబ్దపు “యుగపురుషుడు” నరేంద్ర మోదీ అని అన్నారు.”మహాత్మా గాంధీ సత్యం మరియు అహింస సహాయంతో బ్రిటిష్ వారి బానిసత్వం నుండి మనల్ని విడిపించాడు. ప్రధాని మోడీ మన దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు.

ప్రధానిని మహత్మా గాంధీతో పోల్చడం ఆమోదయోగ్యం కాదన్న మాణిక్కం ఠాకూర్

ఇది మనం ఎప్పుడూ చూడాలనుకుంటున్నమని ధన్‌ఖర్ అన్నారు. మహాత్మా గాంధీ, ప్రధాని మోదీ ఇద్దరూ శ్రీమద్ రాజ్‌చంద్ర జీ బోధనలను ప్రతిబింబించారని ఉపరాష్ట్రపతి అన్నారు. ఉపరాష్ట్రపతి ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ఇది చాలా దురదృష్టకరం మరియు భారతదేశంలోని ప్రతి వ్యవస్థ కుప్పకూలిపోతున్నట్లు తెలుస్తుంది. భారత ఉపరాష్ట్రపతి ప్రధానిని మహత్మా గాంధీతో పోల్చడం ఆమోదయోగ్యం కాదు మరియు ప్రధాని మోడీ కూడా దానిని అంగీకరించరు అని అన్నారు.

ప్రధాని మోదీని, గాంధీ తో పోల్చడం పై నేను చాలా బాధపడ్డానని కాంగ్రెస్ నాయకుడు మాణిక్కం ఠాకూర్ వెల్లడించారు.

Also Read: పార్లమెంట్‌కు, దేశ ఆర్థికాభివృద్ధికి మహిళలు వెన్నెముక: జగదీప్ ధన్‌ఖర్