Home   »  జాతీయం   »   కేజ్రీవాల్ రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన గుజరాత్ హైకోర్టు..!

కేజ్రీవాల్ రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన గుజరాత్ హైకోర్టు..!

schedule mahesh

అహ్మదాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన సమాచారాన్ని అందించాలని కేంద్ర సమాచార కమిషన్‌, (సీఐసీ) గుజరాత్‌ యూనివర్సిటీకి ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు(Gujarat High Court) గురువారం కొట్టివేసింది.

గతంలో కేజ్రీవాల్‌ పై రూ.25,000 జరిమానా విధించిన Gujarat High Court

మార్చిలో కేంద్ర సమాచార కమిషన్‌ ఉత్తర్వుపై గుజరాత్ యూనివర్సిటీ అప్పీల్‌ను హైకోర్టుకి చెందిన జస్టిస్ బిరెన్ వైష్ణవ్ అనుమతించారు. మోదీ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ) డిగ్రీకి సంబంధించిన సమాచారాన్ని కేజ్రీవాల్‌కు అందించాలని గుజరాత్‌ యూనివర్సిటీకి, సమాచార కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టిన హైకోర్టు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతపై రూ.25,000 జరిమానా ను విధించింది.

కేజ్రీవాల్ తన రివ్యూ పిటిషన్‌లో లేవనెత్తిన కీలకమైన వివాదం ఏమిటంటే మోడీ డిగ్రీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని గుజరాత్ విశ్వవిద్యాలయం చేసిన వాదనకు విరుద్ధంగా, విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో ఎటువంటి సమాచారం అందుబాటులో లేదని పిటిషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్, ఈ పిటిషన్ ను కొట్టివేసిన గుజరాత్ హైకోర్టు.