Home   »  జాతీయం   »   Gujarat High Court |ఆ పిల్లలను బడికి పంప‌డం నేరం

Gujarat High Court |ఆ పిల్లలను బడికి పంప‌డం నేరం

schedule sirisha

Gujarat High Court :-

  • గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
  • మూడేళ్లు నిండని పిల్లలను ప్రీస్కూల్‌లో చేర్పించడం నేరం.
  • ఒకటో తరగతిలో చేరడానికి కనీస వయసు ఆరేళ్లు.

మూడేళ్ల లోపు పిల్లలను బలవంతంగా ప్రీ స్కూల్ కు పంపించడం చట్ట విరుద్ధమైన చర్య అంటూ గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతిలోకి ప్రవేశం పొందాలంటే వయసు ఆరేళ్లు నిండాలంటూ ఇటీవల గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు తాజా తీర్పును వెలువ‌రించింది.

విద్యాహక్కు చట్టం-2012 నిబంధనల ప్రకారం మూడేళ్లు నిండని పిల్లలను ప్రీస్కూల్‌లో చేర్చుకోరాదని పేర్కొంది.

ఒకటో తరగతిలో చేరడానికి కనీస వయసు ఆరేళ్లు తప్పని సరిగా ఉండాలంటూ గుజరాత్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

2023 జూన్ 1 నాటికి ఆరేళ్ల వయసు నిండని పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ నోటిఫికేషన్ ను సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం జూన్ 1 నాటికి మూడేళ్ల వయసు పూర్తి చేసుకోని విద్యార్థులను ప్రీ స్కూల్స్ చేర్చుకోరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మూడేళ్ల పాటు ప్రీ స్కూల్ విద్య, సంరక్షణ అనేవి మొదటి తరగతిలో ప్రవేశానికి చిన్నారులను సిద్ధం చేసినట్టు అవుతుందని పేర్కొంది.

ప్రస్తుతం పోటీ ప్రపంచంలో తమ పిల్లలు పుట్టడంతోనే అన్నీ నేర్చుకోవాలని తల్లిదండ్రులు ఆశ పడుతున్నారు. దాని కోసం వారి పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు.

మూడేళ్ల లోపే వారిని ప్రీ స్కూల్ అంటూ జాయిన్ చేస్తున్నారు. దీంతో కొంత మంది పిల్లలు మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. పిల్లలు స్కూల్ కు వెళ్లనని ఏడుస్తున్నకూడా కొట్టో, తిట్టో బలవంతంగా వారిని స్కూల్ కు పంపిస్తున్నారు. పై చదువులలో స్టాండర్డ్ బాగుండాలంటే ప్రీ స్కూల్ నుంచే మంచిగా చదవాలని వారిని ఒత్తిడికి గురి చేస్తున్నారు.

అంతక ముందు 5 ఏళ్ల వయసు దాటితేనే స్కూల్ లో వేసే వారు. కానీ ఇప్పుడు మరీ 3 సంత్సరాలకే బడులకు పంపితే వారు తల్లి దండ్రులను మిస్ అవుతున్నారు.

ఆడుకునే వయసులో వారి సమయాన్ని స్కూల్ లోనే గడపుతున్నారు. తల్లిదండ్రులు ఇలా చేస్తూ ఉండంతో ప్రభుత్వమే చిన్నారులకు అండగా నిలిచింది.

ఈ తీర్పును కొంత మంది తల్లిదండ్రలు స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. దీని వల్ల పిల్లలపై మానసిక ఒత్తిడి తగ్గుతుందని కూడా నిపుణులు తెలుపుతున్నారు.